BigTV English
Advertisement

Vishwambhara : 100% సక్సెస్ కొడతా, వశిష్ట నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్

Vishwambhara : 100% సక్సెస్ కొడతా, వశిష్ట నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర. చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ జోనర్ లో చేస్తున్న సినిమా ఇది. వాస్తవానికి అంజి సినిమా తర్వాత మెగాస్టార్ ఈ జోనర్ లో సినిమా చేయలేదు. అందుకనే దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో అవకాశం రాగానే ఈ జోనర్ ఎంచుకున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విపరీతమైన అంచనాలు ఉండేవి.


ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విజయదశమి సందర్భంగా అప్పట్లో విడుదలైంది. అయితే ఈ టీజర్ లో కొన్ని గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండడంతో ఈ సినిమాను విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ అంతా కూడా చిత్ర యూనిట్ దృష్టికి చేరింది. అయితే మొత్తానికి ఈ సినిమా మీద మరింత కేర్ తీసుకున్నారు చిత్ర యూనిట్.

100% సక్సెస్ కొడతా 


ఈ సినిమా విషయంలో దర్శకుడు వశిష్ట మాత్రం కంప్లీట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా వశిష్ట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమా నాకు 1000% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నేను బ్లాక్ బస్టర్ కొడుతున్నాను ఇది ఫిక్స్. జగదేకవీరుడు అతిలోకసుందరి చూసి ఎలా అయితే ఎక్సైట్ అయ్యామో, ఈ మూవీ చూసి కూడా ఫాన్స్ మరియు అన్ని వర్గాలు ఫుల్ సాటిస్ఫై అవుతారు అంటూ తెలిపారు. అలానే ఈ సినిమా స్టోరీ లైన్ కూడా పలు ఇంటర్వ్యూస్ లో చెప్పేసాడు వశిష్ట. హీరో 14 లోకాలను దాటి తనకు కావలసిన దానిని ఎలా తెచ్చుకుంటాడు అనేది సినిమా కథ అంటూ ఈ సినిమా వరల్డ్ ను పరిచయం చేశాడు.

రెండవ సినిమాకే మెగాస్టార్ తో అవకాశం 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్షన్ చేయాలి అని చాలామంది కలలు కంటారు. కానీ అవి అన్ని సందర్భాలలో నిజం కావు. పూరి, త్రివిక్రమ్ వంటి దర్శకులు మెగాస్టార్ తో సినిమా చేయాలని కలలు కన్నారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. కొన్ని సందర్భాలలో అనౌన్స్మెంట్ కూడా చేసేసారు కానీ వర్కౌట్ కాలేదు. అయితే రెండు సినిమాకి మెగాస్టార్ ని డైరెక్షన్ చేసే అవకాశం వశిష్ట కు దక్కింది. బింబిసారా సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఆ అంచనాలు కూడా కొద్ది మేరకు దర్శకుడు పైన ఉన్నాయి. మొత్తానికి దర్శకుడు అయితే కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ చూసుకున్న తర్వాత తను కంప్లీటుగా సాటిస్ఫై అయిన తర్వాతే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాను అని తెలిపాడు.

Also Read: Madharaasi : శివ కార్తికేయన్ మదారాసి సింగిల్ ప్రోమో అదిరింది, ఫేవరెట్ కాంబో ఇస్ బ్యాక్

Related News

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

The Girl Friend Censor : మూవీలో దారుణమైన లిప్ కిస్ సీన్స్… కత్తిరించేసిన సెన్సార్..

Manchu Manoj: రాజ్యం లేదు కానీ రాణిలా చూసుకుంటా.. మనసును హత్తుకుంటున్న మనోజ్ మాట!

Dance master: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు..మరీ ఇంత దారుణమా?

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Big Stories

×