BigTV English

OTT Movie : ప్రపంచాన్ని నాశనం చేసే సైబర్ ఆయుధం మిస్సింగ్… ట్విస్టులతో మతి పోగొట్టే స్పై- థ్రిల్లర్

OTT Movie : ప్రపంచాన్ని నాశనం చేసే సైబర్ ఆయుధం మిస్సింగ్… ట్విస్టులతో మతి పోగొట్టే స్పై- థ్రిల్లర్

OTT Movie : ఒక గ్రిప్పింగ్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమా ఓటీటీలో టాప్ లేపుతోంది. రీసెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా కుటుంబం, దేశభక్తి మధ్య ఉన్న ఎమోషన్స్ ను స్టైలిష్‌గా చూపిస్తోంది. గూఢచార సినిమాలను ఇష్టపడేవాళ్ళకి ఇది ట్విస్టులతో ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తోంది.
ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘బ్లాక్ బ్యాగ్’ (Black Bag) 2025లో విడుదలైన అమెరికన్ స్పై థ్రిల్లర్ సినిమా. ఇది స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వంలో, డేవిడ్ కోయెప్ స్క్రీన్‌ప్లే ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో కేట్ బ్లాంచెట్ (కాథరిన్ వుడ్‌హౌస్), మైకెల్ ఫాస్‌బెండర్ (జార్జ్ వుడ్‌హౌస్), పియర్స్ బ్రాస్‌నన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక గొప్ప గూఢచార థ్రిల్లర్ గా, కుటుంబం, దేశభక్తి మధ్య ఎదురయ్యే సంఘర్షణను చూపిస్తూ, అద్భుతమైన నటన, స్టీవెన్ సోడర్‌బర్గ్ స్టైలిష్ దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది 2025 మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం పీకాక్, అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీలలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సినిమా సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకుంది. 1 గంట 33 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.7/10, రాటెన్ టొమాటోస్ లో 82% రేటింగ్ ను కలిగి ఉంది.


స్టోరీలోకి వెళితే

జార్జ్ వుడ్‌హౌస్, కాథరిన్ అనే వివాహిత జంట, సంతోషకరమైన జీవితం గడుపుతుంటారు. ఇద్దరూ బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌లో లెజెండరీ ఏజెంట్లు. ఈ ఇంటెలిజెన్స్‌ జీవితంలో వీళ్ళు ఎప్పుడూ ఎదో ఒక సమస్యని సాల్వ్ చేస్తూ బిజీగా ఉంటారు. కానీ వారి ప్రేమ ఏమాత్రం తగ్గకుండా బలంగా ఉంటుంది. అయితే ఒక రోజు, కాథరిన్‌పై దేశద్రోహం ఆరోపణలు రావడంతో కథ తీవ్రమైన మలుపు తీసుకుంటుంది. ఆమె తమ దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగలించినట్లు అనుమానిస్తారు. ఇప్పుడు జార్జ్‌కు ఒక కఠినమైన ఆదేశం ఇవ్వబడుతుంది. ఇతను దేశద్రోహుల జాబితాలో ఉన్నవారిని వెంటాడి, విచారించాలి. ఇందులో అతని సొంత భార్య కాథరిన్ కూడా ఉంటుంది. జార్జ్ ఇప్పుడు ఒక డైలమాలో చిక్కుకుంటాడు. తన భార్య పట్ల విశ్వాసం కాపాడుకోవాలా, లేక దేశం పట్ల తన విధిని నిర్వర్తించాలా? అనే ఆలోచనలో ఉంటాడు. అతను ఈ దేశద్రోహం కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌లోని అంతర్గత రాజకీయాలు బయటపడతాయి. కాథరిన్ నిజంగా దేశద్రోహి అని అనుమానించే సాక్ష్యాలు బలంగా ఉన్నప్పటికీ, జార్జ్ తన భార్యపై ఉన్న ప్రేమ, ఆమె పట్ల విశ్వాసంతో ఉంటాడు.

Read Also : ఫీలింగ్స్ రావట్లేదని పిచ్చి పని… అబ్బాయి కాదంటున్నారని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

ఈ ఇన్వెస్టిగేషన్‌లో అతనికి సహాయం చేసే సహచర ఏజెంట్లు, అతని సీనియర్ కూడా కథలో కీలక పాత్రలు పోషిస్తారు.  సినిమా మొత్తం ఒక స్లో-బర్న్ థ్రిల్లర్‌గా, డైలాగ్-హెవీ సన్నివేశాల చుట్టూ తిరుగుతూ, జార్జ్, కాథరిన్ మధ్య ఎమోషన్స్ ను హైలైట్ చేస్తుంది. కథలో అనేక ట్విస్ట్‌లు వస్తాయి. ముఖ్యంగా కాథరిన్ నిజమైన ఉద్దేశాలు, దేశద్రోహం వెనుక ఉన్న నిజం గురించి చివరి అంకంలో బయటపడతాయి. సినిమా ఒక ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఇక్కడ జార్జ్ తన భార్య, దేశం మధ్య ఎంచుకోవాల్సిన ఒక హృదయవిదారక నిర్ణయం తీసుకుంటాడు. అతడు తీసుకునే నిర్ణయం ఏమిటి ? నిజంగానే కాథరిన్ దేశ ద్రోహిగా ఉంటుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : అమ్మ బాబోయ్… పండగ పేరుతో చావుమేళం… ఈ ఊరోళ్ళకి ఇదేం పాడు రోగం భయ్యా

OTT Movie : అమ్మాయిల్ని చంపేసి ఫ్రీజర్ లో దాచే సైకో… ఎక్స్ట్రీమ్ వయోలెన్స్… అవార్డు విన్నింగ్ అలాగే మోస్ట్ కాంట్రవర్షియల్

OTT Movie : వర్షం పడితే మూడ్ వచ్చే సైకో…. రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్

OTT Movie : నెట్ ఫ్లిక్స్‌ను ఓ ఊ‌పు ఊపేసిన సిరీస్… భారీ వ్యూస్ తో పాటు వివాదాలు కూడా

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

Big Stories

×