BigTV English

Aircraft: హైదరాబాద్ ఐటీ సెంటర్‌‌లో ఉన్న ఈ విమానం కథ తెలుసా? అక్కడికి ఎలా వచ్చింది?

Aircraft: హైదరాబాద్ ఐటీ సెంటర్‌‌లో ఉన్న ఈ విమానం కథ తెలుసా? అక్కడికి ఎలా వచ్చింది?

ఫొటో చూడగానే.. ఏంటీ? మాదాపూర్ ఐటీ సెంటర్‌లో విమానం ఉందా? నేను ఎప్పుడూ చూడలేదే? ఎలా మిస్ అయ్యాం.. అని అనుకుంటున్నారా? గ్రాఫిక్స్ లేదా ఏఐ అయ్యుంటుందిలే అని అనుకుంటే పొరపాటే. అక్కడ నిజంగానే విమానం ఉంది. సరిగ్గా హైదరాబాద్ T-Hub సమీపంలో. అయితే, అటు వైపు వెళ్లేవారికి అది కనిపించకపోవచ్చు. ఎందుకంటే.. దానికి రేకుల ప్రహారీ అడ్డుగా ఉంది. కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీసులు, అపార్టుమెంట్ల నుంచి చూస్తే ఆ విమానం స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది ఇప్పటికే ఆ విమానం ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ చేస్తున్నారు. అయితే, చాలామందిలో ఒకే సందేహం.. అసలు ఆ విమానం అక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు అక్కడ పెట్టి వదిలేశారని..


రెస్టారెంట్ కోసమేనా?

ఆ విమానాన్ని అక్కడికి తరలించి చాలా ఏళ్లు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. పిస్తా హౌస్ లేదా మరేదైనా పెద్ద ఫుడ్ చైన్ సంస్థ ఎయిరోప్లేన్ థీమ్‌ రెస్టారెంట్ కోసం ఆ విమానాన్ని అక్కడికి తీసుకొచ్చి ఉంటారని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దానికి సమీపంలో జాబ్స్ చేస్తున్న ఉద్యోగులు ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఈ విమానం ఇక్కడ ఎందుకు ఉందో చెప్పండయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మిస్టీరియస్ ప్లేన్ ఎలా వచ్చింది.. ఎప్పుడు వచ్చింది.. ఎందుకు వచ్చిందో తెలిస్తే ఎవరైనా చెప్పండని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


దీన్ని మ్యూజియంగా మార్చాలి..

ప్రస్తుతం ఆ విమానం ఉన్న ఖాళీ స్థలం ఎవరిదో తెలీదు. ఒక వేళ ప్రభుత్వానిదైతే.. అక్కడ పార్కును డెవలప్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విమానాన్ని మ్యూజియంగా మార్చి సందర్శకులకు అవకాశం ఇవ్వాలన్నారు. విమానం చూడాలని ఆశపడే సామాన్యులకు, పిల్లలకు తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ విమానాన్ని రెస్టారెంటుగా డెవలప్ చేసే పనులేవీ అక్కడ జరగడం లేదు. కింగ్‌ఫిషర్ సంస్థకు చెందిన ఈ విమానం దాదాపు శిథిల స్థితికి చేరుకుంటోంది. దీన్ని మీరు గూగూల్ మ్యాప్ ద్వారా కూడా స్పష్టంగా చూడవచ్చు. అయితే, ఆ విమానం అక్కడికి ఎప్పుడు.. ఎలా.. ఎందుకు వచ్చింది? దేని కోసం అక్కడ ఉంచారనే మిస్టరీ మాత్రం వీడటం లేదు. మరి, మీకు ఏమైనా తెలుసా?

అయితే, ఇండియాలో కొన్ని పాత విమానాలను రెస్టారెంట్లుగా మార్చారు. కొన్నింటిని విమానం థీమ్‌లో రూపొందించారు. ఈ విమానాన్ని కూడా అలా మార్చేందుకు వీలుంది. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానం రెస్టారెంట్లపై ఓ లక్ వేద్దామా?

హవాయి అడ్డా (Hawai Adda), లుధియానా, పంజాబ్: ఇది ఇండియాలోనే మొట్టమొదటి విమానం రెస్టారెంట్. పాత ఎయిర్ బస్ A320 విమానాన్ని కొనుగోలు చేసి.. దాన్ని రెస్టారెంట్‌గా మార్పులు చేశారు. ఇది పూర్తిగా వెజిటేరియన్ రెస్టారెంట్. లోపల లగ్జరీ ఇంటీరియర్, ప్రైవేట్ డైనింగ్ క్యాబిన్‌లు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వెళ్తే ట్రై చెయ్యండి.

విమానం స్కై రెస్టారెంట్(Vimanam Sky Restaurant), వరంగల్, తెలంగాణ: ఇది వరంగల్‌లోని భద్రకాళి ట్యాంక్ బండ్ సమీపంలో ఉంది. ఇక్కడ సౌత్, నార్త్ ఇండియాన్ ఫుడ్‌తోపటు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ కూడా లభిస్తుంది. ఈ విమానం రెస్టారెంట్‌లో సిబ్బంది పైలట్, కేబిన్ క్రూ తరహాలో డ్రెస్ వేసుకుని వడ్డిస్తారు. వరంగల్ వెళ్తే తప్పకుండా సందర్శించండి.

Also Read: ఎయిరో ట్రైన్.. ఈ రైలు ఎక్కితే గాల్లో తేలినట్లు ఉంటుంది.. కెఫే, బార్ కూడా ఉన్నాయ్!

ముంబయి, ఢిల్లీ, కొయంబత్తూరులో కూడా: ఢిల్లీలోని గార్డెన్ గల్లేరి ప్రాంతంలో ఒక పాత ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాన్ని రెస్టారెంట్‌గా మార్చారు. అయితే, ఇక్కడి ఫుడ్ కోర్ట్ చాలా చిన్నది. ఇంకా ముంబయిలో కూడా బోయింగ్ 737 విమానాన్ని సైతం రెస్టారెంటుగా మార్చారు. తమిళనాడులోని కొయంబత్తూరులో కూడా విమానం థీమ్ రెస్టారెంట్ ఒకటి ఉంది.

Related News

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

Big Stories

×