Producer SKN: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న వారిలో ఎస్కేఎన్ ఒకరు. తాజాగా ఈయన రష్మిక (Rashmika)హీరోయిన్ గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ కే ఎన్ రష్మిక సినిమాల పట్ల చూపించే అంకితభావం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ఎన్ని గంటలు పనిచేయాలని మేము మాట్లాడుకునే సమయంలో రష్మిక ఎన్ని గంటలైనా పని చేస్తాను అని మాట్లాడారు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఇలా మాట్లాడే ఏకైక హీరోయిన్ రష్మిక మాత్రమే అంటూ ఎస్కేఎన్ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
రష్మిక పనిచేస్తున్నారు అంటే ఆ పనిని టైంతో ఎప్పుడు పోల్చరని, పనిని ప్రేమతో చేస్తారని, అందుకే రష్మిక గారు అంటే ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు మన ఇంట్లో అమ్మాయి లాగా ఫీల్ అవుతారని ఎస్ కే ఎన్ వెల్లడించారు. ఇలా సినిమా కోసం తాను నిర్దిష్ట సమయం పెట్టుకోరని ఎంతసేపైనా పని చేయడానికి రష్మిక సిద్ధంగా ఉంటారంటూ నిర్మాత వెల్లడించడంతో ఈయన రష్మికపై ప్రశంసలు కురిపిస్తూనే పరోక్షంగా మరొక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు (Deepika Padukone)కౌంటర్ ఇచ్చినట్లు ఉంది అంటూ ఈయన వ్యాఖ్యలపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా సినిమా వర్కింగ్ అవర్స్ గురించి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొనే తాను ఎనిమిది గంటలపాటు సినిమా కోసం పని చేయను అంటూ ఈమె పాన్ ఇండియా సినిమాల నుంచి తప్పకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎక్కువ గంటలు పని చేయనని దీపిక చెప్పిన ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఎస్కేఎన్ రష్మిక గురించి మాట్లాడుతూ ప్రశంసల కురిపించారని స్పష్టమవుతుంది. సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ ఉన్న రష్మిక సమయాభావంతో పని లేకుండా సినిమాలను అంకితభావంతో పనిచేస్తారని మరోసారి నిరూపించుకున్నారు.
రాహుల్ రవీంద్రన్..
ఇక రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే.. దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి పలువురు సెలబ్రిటీలు మాట్లాడుతూ భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాకు నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి ఈ సినిమాలో రష్మిక ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.
Also Read: Bunny vasu: అల్లు అరవింద్ కోటింగ్… దెబ్బకు దారిలోకి వచ్చిన బన్నీ వాసు.. ఏం జరిగిందంటే ?