Bunny Vasu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బన్నీ వాసు (Bunny Vasu)ఒకరు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వ్యవహారాలను చూసుకుంటూ బన్నీ వాసు ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఇటీవల బీవీ వర్క్స్(B.V.Works) అంటూ కొత్త బ్యానర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి ఇటీవల మిత్రమండలి(Mithra Mandali) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో బన్నీ వాసు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బన్నీ వాసు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ వాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రవర్సీ ఏమీ లేదు అంతా కూల్ అయిపోయింది.. మొన్న జరిగిన దాని గురించే అల్లు అరవింద్ గారు బాగా క్లాస్ పీకారని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. మిత్రమండలి ప్రమోషన్లలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదం పై అల్లు అరవింద్ బన్నీ వాసుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టం అవుతుంది.
ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ నిజానికి వైరల్ కంటెంట్ ఇవ్వమని చెప్పేది అల్లు అరవింద్ గారే అయితే తేడా వచ్చిందో వైర్ పెట్టి కొట్టేది కూడా ఆయనే అంటూ తెలిపారు. మొన్న ఇచ్చిన వైరల్ స్పీచ్ కి మా నాన్నతో కూడా నేను అన్ని తిట్లు తిని ఉండను. అల్లు అరవింద్ గారు అంతలా నన్ను తిట్టారని ఈయన వెల్లడించారు. మరో నాలుగు ఐదు నెలలు నా నుంచి ఎలాంటి వైరల్ స్పీచ్ ఉండదు అంటూ ఈ సందర్భంగా బన్నీ వాసు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
అంచనాలు పెంచిన ట్రైలర్..
అల్లు అరవింద్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సందర్భాలలో అల్లు అరవింద్ గురించి బన్నీ వాసు మాట్లాడుతూ నేను అల్లు అరవింద్ గారి దగ్గర ఉన్నంత సమయం మా నాన్న దగ్గర కూడా ఉండలేదని తెలిపారు. ఇలా అల్లు అరవింద్ గారి వద్ద గీత ఆర్ట్స్ వ్యవహారాలని చూసుకుంటూ బన్ని వాసు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గీత ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో రష్మికకు జోడిగా నటుడు దీక్షిత్ శెట్టి నటించారు
Also Read: Rashmik: ది గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..తెలిస్తే మతి పోవాల్సిందే!