Kantara Chapter1: కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty)ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో మంచి ఆదరణ లభిస్తుంది.
ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోగా, రేపు మరో అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో అభిమానులు కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేవి కానీ, ఇటీవల కాలంలో గురువారం విడుదలవుతున్నాయి. ఇలా సినిమా గురువారం విడుదల అవుతుంది అంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లను బుధవారమే వేస్తున్నారు.
కాంతార చాప్టర్1 సినిమా అక్టోబర్ 2వ తేదీ అనగా గురువారం విడుదల కానుంది. అయితే 1వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి ఆరోజు కూడా బుధవారం కావడం విశేషం.. అయితే ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఓజీ (OG)సినిమాల విషయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రిషబ్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ జూలై 23 బుధవారం పడ్డాయి. అయితే సినిమా పెద్దగా ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరిచాయి.
హైదరాబాద్ లో ప్రీ రిలీజ్..
ఇటీవల విడుదలైన ఓజి సినిమా కూడా బుధవారం ప్రీమియర్లు ప్రసారం అయ్యాయి. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో టార్గెట్ రీచ్ కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంతార చాప్టర్1 సినిమా ప్రీమియర్ కూడా బుధవారం కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల విషయంలో వచ్చిన ఫలితాలు కాంతార విషయంలో రిపీట్ అవ్వకూడదని అభిమానులు భావిస్తున్నారు. మరి రిషబ్ ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీ హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ఈ వేడుక జరుగునుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు.