దసరా పండుగ సందర్భంగా ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రద్దీని కంట్రోల్ చేయడానికి అదనపు రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ లోని పలు రైళ్లే స్టేషన్లలో ప్రత్యేక రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్స్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
దసరా రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు హైదరాబాద్ లోని పలు రైల్వే స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో ఎంపిక చేసిన రైళ్లకు ఈ స్టాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్ జంక్షన్ లో పండుగ రద్దీని తగ్గించడం, ఐటీ కారిడార్ ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది.
విశాఖపట్నం – లింగంపల్లి (12805/12806), విశాఖపట్నం – ముంబై LTT (18519/18520), కాజీపేట – హడప్సర్ (17014/17013) సహా పలు రైళ్లు ఇక్కడ కొంతకాలం ఆగుతాయి.
నరసాపూర్ – లింగంపల్లి (17255/17256), కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775/12776) సర్వీసులు రెండు స్టేషన్లలో ఆగుతాయి.
దానపూర్ – సికింద్రాబాద్ (12791/12792) ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్ లు ఇవ్వబడ్డాయి.
రాజ్ కోట్(22717/22718), పోరు బందర్(20967/20968), తిరుపతి(12731/12732), ముంబై(12701/12702) రైళ్లకు అదనపు స్టాప్‌లు ఇచ్చారు.
Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?
సికింద్రాబాద్ జంక్షన్ లో రద్దీని తగ్గించడంతో పాటు పండుగ రద్దీ సమయంలో ఐటీ కారిడార్ ప్రయాణీకులు, సబర్బన్ ప్రయాణీకులకు ఎక్కువ సౌకర్యాన్ని అందించడం లక్ష్యంగా ఈ తాత్కాలిక హాల్ట్ లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పండుగ సీజన్ లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైల్వే స్టేషన్ల మీద అదనపు భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్లేవాళ్లు, తిరిగి వచ్చే వాళ్లు ఈ టెంపరరీ హాల్టింగ్స్ ఉపయోగించుకోవాలని సూచించారు.
Read Also: అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!