Vijay Devarakonda: ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం మాతో మంచి పేరును సాధించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో విజయ్ చేసిన రిషి అనే పాత్ర ఇప్పటికీ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అవుతుంది.
తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన పెళ్లిచూపులు సినిమాతో విజయ్ హీరోగా మారాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో విజయ్ ను ఆదరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో విజయ్ స్టార్ హీరో అయిపోయాడు.
మీరు మారిపోయారు సార్
అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ముందు విజయ్ మాట్లాడే విధానం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధించడంతో విజయ్ కొన్ని రోజులు పాటు అదే పద్ధతిలో మాట్లాడారు. చాలామంది ఈ హీరోకు ఇంత ఆటిట్యూడ్ ఏంటి అనే కామెంట్లు కూడా చేశారు. రీసెంట్ టైమ్స్ లో విజయ్ మాట్లాడే విధానం పూర్తిగా మారిపోయింది. అనని విజయ్ సక్సెస్ కొట్టి కూడా చాలా ఏళ్ళు అయింది. గౌతమ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా జులై 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈవెంట్లో విజయ మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. టెక్నీషియన్స్ అందరి గురించి అద్భుతంగా మాట్లాడారు. విజయ్ మాటలు విన్న తర్వాత చాలా మార్పు వచ్చింది అని చాలామంది కనిపిస్తుంది. ఎప్పుడు గట్టిగా మాట్లాడే విజయ్ ఈసారి మాత్రం పద్ధతిగా మాట్లాడారు.
భారీ అంచనాలు
ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా మీద తన నమ్మకాన్ని తెలియజేశారు. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. ఈ సినిమా విషయంలో ఎటువంటి రివ్యూలు వచ్చినా కూడా తను స్వాగతిస్తాను అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ వచ్చిన కూడా ఆన్సర్ చేస్తాను అని తెలిపారు. ఈ సినిమాను జనాల మధ్యకు తీసుకు వెళ్లడానికి నాగ వంశీ చాలా కృషి చేశారు. నాగ వంశీ అంతలా నమ్మాడు అంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అని అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. జులై 31న ఈ సినిమా ఫలితం తెలియాల్సి ఉంది.
Also Read : Satya Dev : విజయ్ దేవరకొండ కాదు, విజయ్ బంగారు కొండ