BigTV English
Advertisement

Coolie Trailer: అయ్యయ్యో లోకేష్ నీకు ఇది తగునా.. పోస్టర్ కూడా కాపీ కొట్టాలా?

Coolie Trailer: అయ్యయ్యో లోకేష్ నీకు ఇది తగునా.. పోస్టర్ కూడా కాపీ కొట్టాలా?

Coolie Trailer: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రజనీకాంత్ (Rajinikanth) త్వరలోనే కూలీ (Coolie)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన “పవర్ హౌస్” అనే పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా నుంచి త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ట్రైలర్ ఆగస్టు రెండో తేదీ విడుదల కాబోతుంది అంటూ ఇటీవల నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఒక అధికారక పోస్టర్ విడుదల చేశారు.


పోస్టర్ కూడా కాపీనా?

ఇక ఈ పోస్టర్ లో భాగంగా ఈ సినిమాలో నటించిన వారందరి ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో డైరెక్టర్ లోకేష్ పై పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఈ పోస్టర్ అచ్చం హాలీవుడ్ సినిమా మేడమ్ వెబ్ (madame web) సినిమా పోస్టర్ ను పోలీ ఉండడంతో డైరెక్టర్ లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ గా లోకేష్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేసే ఒక డైరెక్టర్ మరొక సినిమా పోస్టర్ ను కాపీ కొట్టడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.


నెగిటివ్ పాత్రలో నాగార్జున..

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, సంజయ్ దత్ లాంటి బడా హీరోలు ఈ సినిమాలో నటించారు. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి నాగార్జున విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

భారీ స్థాయిలో అంచనాలు…

ఇక ఈ సినిమాలో శృతిహాసన్ నటించిన పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచింది. ఇక ట్రైలర్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ట్రైలర్ ఆగస్టు రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండదని ఈయన తెలియజేశారు. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత రజనీకాంత్ కూలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

Also Read: Samantha : మీ వారసత్వం ఎందుకు పనికి రాదు… నాగ చైతన్యకు సమంత ఛాలెంజ్ ?
 

Related News

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Big Stories

×