Madhya Pradesh: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన డాక్టర్లు.. బాధ్యతలను మరిచి కొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లా బిస్రాముండ కాలేజ్‌లో చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా ముగ్గురు డాక్టర్ల మధ్య నైట్ డ్యూటీ విషయంపై గొడవ జరుగుతోంది. సెప్టెంబర్ 11న రాత్రి 9.30 గంటలకు డాక్టర్ శివాని లేబర్ రూమ్‌లో డ్యూటీ చేస్తోంది. ప్రసవ నొప్పులతో చేరిన ఓ గర్భిణీకి చికిత్స అందిస్తోంది. అదే టైమ్‌లో ఇద్దరు డాక్టర్లు అక్కడికి వచ్చి డాక్టర్ శివానీతో గొడవపడ్డారు. వాళ్లను ఆపేందుకు మిగతా డాక్టర్లు ప్రయత్నించారు. ప్రసవ నొప్పులతో గర్భిణీ ఆర్తనాదాలు చేస్తున్నా సరే డాక్టర్లు విచక్షణరహితంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై శివానీ ఆస్పత్రి యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.