E-Paper
Advertisement

Disha patani : దిశా పటానీకి అండగా ముఖ్యమంత్రి.. దోషులను ఎక్కడున్నా పట్టుకుంటాం..!

Disha patani : దిశా పటానీకి అండగా ముఖ్యమంత్రి.. దోషులను ఎక్కడున్నా పట్టుకుంటాం..!
Advertisement

Disha patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినా కూడా యూత్ ఫాలోవర్స్ ను బాగానే పెంచుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. హాట్ అందాలతో మతిపోగొడుతుంది.. తాజాగా ఈ మా ఇంటి పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తన సోదరి కుష్బూ చేసిన వ్యాఖ్యలే ఆ కాల్పులకు కారణమని తెలుస్తుంది. అయితే ఈ కాల్పుల వెనక ఏదైనా కుట్ర ఉందా అన్నది తెలియలేదు.. కానీ ప్రస్తుతం నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. తాజాగా వీరికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండగా నిలిచారని తెలుస్తుంది.

దిశా కుటుంబానికి అండగా సీఏం..

బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణ ధనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా వారికి సాయం చేయనున్నట్లు తెలుస్తుంది. దిశా కుటుంబానికి ఫోన్ చేసి భద్రత కల్పించడమే కాకుండా, కాల్పులకు కారణమైన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ పటానీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎటువంటి నిర్లక్ష్యం వహించమని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. నిందితులను ఎక్కడున్నా పట్టుకుంటాం అని హామీ ఇచ్చారు.. మాకు పూర్తిగా భద్రతను ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దిశా తండ్రి..

కాల్పులకు కారణం ఏంటంటే..?

Advertisement

దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తోంది. ఓ వర్గ మనోభావాలను దెబ్బతీసేలా ఆమె మాట్లాడడంతో దాడి చేశారని అంటున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అంతగా దుమారం రేపుతుంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటూ ఒక సందేశం కూడా విడుదల చేశారు. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. భవిష్యత్‌లో మతాన్ని, సాధువులను అవమానిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.. అయితే దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్నది తెలియలేదు కానీ పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేశారు. ఈ కాల్పులు కలిసిన దోషులను వెంటనే పోలీసులు గుర్తించి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘మిరాయ్ ‘ మూవీని కాపీ కొట్టారా? ఇదిగో ప్రూఫ్..డైరెక్టర్ బుక్కయ్యాడే..?

Advertisement

దిశా పటాని సినిమాల విషయానికొస్తే.. ఈమె బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది.. తెలుగు కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోడంతో అమ్మడు రేంజ్ కూడా పెరిగిపోయింది. అలాగే చివరిగా కంగువ సినిమాలో నటించింది. అది పెద్దగా హిట్ అవ్వలేదు కానీ ఈ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఓ రెండు మూడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×