తాజాగా బాలీవుడ్ మీడియాలో టాలీవుడ్ హిట్ సినిమా అరుంధతికి రీమేక్ చేయాలనే ప్రతిపాదన బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. 2009 లో రిలీజైన ఈ సినిమా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అరుంధతిగా అనుష్కను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేనంత విధంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక అరుంధతి సినిమా అన్ని భాషల్లో రీమేక్ చేశారు. వారి వారి భాషల్లో ఆ సినిమా హిట్ అయ్యిందో లేదో అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా రీమేక్ కాలేదు. అంటే ఎవరూ దాన్ని రీమేక్ చేసే దైర్యం చేయలేదు. మొదట్లో దీపికాతో ఈ సినిమాను రీమేక్ ప్లాన్ చేశారు కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ రీమేక్ మరుగున పడింది. అయితే ఇన్నాళ్లకు ఈ సినిమా రీమేక్ మళ్లీ తెరమీదకు వచ్చింది.
అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో అరుంధతి రీమేక్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గాడ్ ఫాదర్ తో తెలుగులో చిరుతో రీమేక్ తీసిన మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు చేపట్టడాన్ని టాక్. అనుష్క ప్లేస్ లో అందాల భామ శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారట. అమ్మడు డ్యాన్సర్ కావడంతో.. అనుష్కను మ్యాచ్ చేస్తుందని అనుకుంటున్నారట. ఈ వార్త విన్న నెటిజన్స్ ఏంటి కామెడీ చేస్తున్నారా .. అనుష్కను శ్రీలీల మ్యాచ్ చేయడం ఏంటి.. ? ఆమె ఎక్కడ.. ఈమె ఎక్కడ.. ? అసలు ఆ సినిమాను రీమేక్ చేయడమే పెద్ద వేస్ట్ పని పెదవి విరుస్తున్నారు. ఐకానిక్ మూవీస్ ను ముట్టుకోకుండా ఉంటేనే బెటర్.. కాదు లేదు అని తెరకెక్కించి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదే కనుక నిజమైతే మాత్రం బాలీవుడ్ మరో ప్లాప్ కు సిద్ధం కమ్మని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత.. అబద్ధమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో చిన్నది ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.