Uppal: ఉప్పల్‌ల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వాహనంను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఓ డ్రైవర్. ఉప్పల్ NGRI సమీపంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గరలో ఈ ఘటన జరిగింది.సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ కుమార్ ముందుగా వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహారీ గొడను ఢీ కొట్టింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలంలో ఉన్న స్థానికులు కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కుమార్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.