ENERepeat: సినిమాలు మూడు గంటలు వినోదమే అయినా కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు చూస్తే అచ్చగుద్దినట్లు మన జీవితాలు కూడా ఇలానే ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు అబ్బబ్బ మన జీవితాలు కూడా ఆ సినిమాలా ఉంటే బాగుండు అనిపిస్తాయి. అలా ఎంతోమంది యువతను అచ్చు మా జీవితంలోనే ఉంది అని అనిపించేలా చేసిన సినిమా ఈ నగరానికి ఏమైంది. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. ఈ నగరానికి ఏమైంది కూడా అలాంటి సినిమాని అని చెప్పొచ్చు.
ఆనందమైన జీవితమంటే డబ్బు సంపాదించి, స్టేటస్ లో బతకడం కాదు.నలుగురు స్నేహితులుతో కలిసి ఉంటూ తమకు నచ్చిన పని చేయడమే ఆనందమైన జీవితమని ఈ సినిమాలో చూపించారు. ఇప్పటికీ ఎంతోమంది కుర్రాళ్లకు ఈ నగరానికి ఏమైంది సినిమా ఆదర్శంగా నిలిచింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమను కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనంగా మారింది.
ముఖ్యంగా వివేక్, కౌశిక్ పాత్రలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి. జీవితం అంటే ఇలాగే ఉండాలి అని ఎంతోమందికి నేర్పింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది ఎంతో పెద్ద విజయాన్ని అందించింది. తరుణ్ భాస్కర్ ఎన్ని సినిమాలు తీసినా.. ఆయనకంటూ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది మొదట ఉంటుంది. ఈమధ్యకాలంలో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అప్పటినుంచి ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
తరుణ్ భాస్కర్ ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా పనిచేశాడు. అంతకుమించి నటుడిగా ఎదిగాడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్యాప్ తీసుకున్న తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ప్రకటించాడు. ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కనుందని మేకర్స్ ప్రకటించారు. ది మోస్ట్ ఐకానిక్ కన్య రాశి గ్యాంగ్ మళ్లీ తిరిగి వస్తుంది అంటూ రాసుకోచ్చారు. ఇక ఈ చిత్రంలో మొదటి పార్ట్ లో ఉన్న నలుగురు హీరోలు రెండో పార్ట్ లో కూడా ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా తర్వాత విశ్వక్ పెద్ద హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా విశ్వక్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం శశరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మొదటి పార్ట్ లో టీమ్ కన్యరాశి గోవాలో చేసిన హంగామా ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. మరి ఈసారి కన్యారాశి గ్యాంగ్ ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో చూడాలి.
From:
Bro this is our vibeTo:
Bro it’s happening again 😭The Most iconic Kanya Raasi gang is BACK ❤️#ENERepeat #ENE pic.twitter.com/VXj4kDrMEu
— ENE Repeat (@ENERepeat) June 29, 2025