Kalki 2 Update: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ , ‘మహానటి’ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin). డైరెక్షన్లో తన మార్క్ చూపించి, అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలా ఏకంగా ప్రభాస్ (Prabhas) తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే(Deepika Padukone), రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వంటి భారీ తారాగణంతో సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిలిం గా ‘కల్కి 2898 ఏడి’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్వినీ దత్ (Ashwini Dutt) నిర్మించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది
కల్కితో సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్..
2024 జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద రూ.1178.38 కోట్లు రాబట్టింది. రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. ఇక ఈ సినిమా ఓటీటీ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ , తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
కల్కి 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
ఇకపోతే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించారు. మరి కల్కి 2 ఎప్పుడు ఉండబోతోంది అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కల్కి 2 రావడం సాధ్యమయ్యేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఈ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఇచ్చిన అప్డేట్ అభిమానులలో పూర్తి ఎక్సైజ్ మెంట్ ను కలిగిస్తోంది.
షూటింగ్ స్టార్ట్.. రిలీజ్ డేట్ అప్పుడే..
ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమా సీక్వెల్ పై కీలక అప్డేట్ ఇచ్చారు. “ప్రస్తుతం చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కల్కి 2 సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ లో సెక్స్ పైకి వెళ్తుందని, అలాగే 2026 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు” ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. ఒక సంవత్సరం కళ్ళు మూసుకుంటే కల్కి 2 చూసేయచ్చని తెగ సంబరపడిపోతున్నారు. కల్కితో సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో మరెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో చూడాలి.
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Maruthi ) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాదులోనే జరగనున్నట్లు సమాచారం. అలాగే హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో ‘ఫౌజీ’, సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అంతేకాదు స్పిరిట్, సలార్ 2 వంటి చిత్రాలు లైన్లో ఉన్న విషయం తెలిసిందే.
also read:Raghava Lawrence: చైల్డ్ ఆర్టిస్ట్ కోసం రాఘవ ఆవేదన.. ఒక్కసారి కలువు అంటూ ఎమోషనల్!