EVV Cinema: ఈవీవీ ..ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు విరుస్తాయి.అలాంటి దర్శకుడి బ్యానర్ పై పెట్టిన ‘ఈవీవీ సినిమా’బ్యానర్ పై ఇప్పటి వరకు ఇప్పటికి వచ్చిన సినిమాలన్నీ ఆ జానర్లో తెరకెక్కినవే. అలా వచ్చిన వాటిలో చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, తొట్టి గ్యాంగ్, అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ, ఫిట్టింగ్ మాస్టర్, నువ్వంటే నాకిష్టం, కితకితలు వంటి సినిమాలు ఎలా నవ్వులు పూయించాయో చెప్పక్కర్లేదు.
ఇక ఇదే క్రమంలో చాలా రోజుల తర్వాత ఈ బ్యానర్ లో మరో సినిమా మొదలైంది. అవును ..ఆర్యన్ రాజేష్ నిరాతగా ఈవీవీ సినిమా బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.10 గా, అలాగే ఎన్.వి. కృష్ణారెడ్డితో కలిసి ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 గా సరికొత్త ప్రాజెక్ట్ ని మొదలెట్టారు.
అయితే ఇప్పటి వరకు కామెడీ సినిమాలని తెరకెక్కించిన ఈవీవీ బ్యానర్ లో కామెడీ సినిమా కాకుండా మరో జానర్ లో సినిమా చేస్తుండటం విశేషం.సొసైటీలో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా, గుండెల్నిమెలిపెట్టే ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాని డిజైన్ చేయబోతున్నారట.ఇక ఈ సినిమాలో హీరోగా కోర్ట్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ రోషన్ నటిస్తుండటం విశేషం. ఇక హర్ష్ రోషన్ కి జోడీగా నటిస్తున్న ప్రియాంక ఆచర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది.
also read:టాలీవుడ్‌లో నా పేరు రిజిస్టర్ కాలేదనే బాధ ఉంది.. నటుడు శ్రీమన్ ఎమోషనల్ కామెంట్స్
ఇక ఈ సినిమాకి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని కలిసి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. నిజానికి హాలీవుడ్ లో ఇలా ఇద్దరు కలిసి ఒక సినిమాకి దర్శకత్వం చేయడం మనం చూస్తుంటాం కానీ ఇలా తెలుగులో ఇద్దరు కలిసి ఒక సినిమాకి దర్శకత్వం చేయడం అరుదనే చెప్పాలి.ఇక కథ విషయానికి వస్తే ఎమోషన్స్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్దం చేసినట్టు తెలుస్తుంది.ఇక తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కాగా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం .ఇక ఈవీవీ బ్యానర్ లో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా వస్తుండటం తో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే జిజు సన్నీ డీఓపీగా ఆన్ బోర్డ్ కాగా, వినీల్ నల్లమిల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఇక
మార్కెటింగ్ బాధ్యతలను విష్ణు తేజ్ పుట్ట చూసుకుంటుండగా పీఆర్వోగా మడూరి మధు బాధ్యతలు చూస్తున్నారు.ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్, ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల తేదీలను మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారట మేకర్స్. చూడాలి మరి ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలని నమోదు చేస్తుందో !