Comedian Ali: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ(Ali) ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించారు. అలీ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా బాల నటుడిగా మొదలైన ఈయన ప్రయాణం వందల సినిమాలలో నటుడిగా నటించే అవకాశాన్ని పొందారు. ఇప్పటికి కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఆలీ సందడి చేస్తున్నారు. ఈయన మన డాక్టర్ బాబే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో అలీ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ తన మొదటి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను వెండితెరపై మొదటిసారి కనిపించిన చిత్రం ప్రెసిడెంట్ పేరమ్మ (President Peramma)అని తెలిపారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో కవిత, నూతన ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అలీ రమా ప్రభ కొడుకు పాత్రలో కనిపించినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ సినిమా కోసం తాను మూడు రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారని అందుకోసం తనకోసం 150 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆలీ తెలియజేశారు. ఇక అలీ 150 రూపాయలు తీసుకొని ఇంట్లో కేవలం 100 రూపాయలు అని చెప్పి 50 రూపాయలు తన ఖర్చులకోసం పెట్టుకున్నానని తెలిపారు. ఆ ₹50 తీసుకొని తాను సినిమాలు చూడటానికే వెళ్లేవాడినని, ఒక విధంగా నా కెరియర్ కోసం ఇది నేను పెట్టిన పెట్టుబడి అంటూ అలీ తెలిపారు. అలా సినిమాలపై ఆసక్తితో థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తూ ఇండస్ట్రీ వైపు రావాలనే ఆసక్తి పెంచుకున్నానని అలీ తెలిపారు.
ఇలా ఆరోజు తాను తీసుకున్న ఈ 50 రూపాయలు కారణంగానే నేడు నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానని అలీ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో కమెడియన్ గా సక్సెస్ అందుకున్న అలీ వందల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారు. ఇక మన డాక్టర్ బాబే(Mana Doctor Babe ) సినిమా విషయానికి వస్తే.. చలపతి కుమార్ పువ్వుల దర్శకత్వంలో శ్రీ స్కంద ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారు. కృతాక్షి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, అలీ, శాంతి కోటేశ్వర రావు వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
Also Read: వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?