E-Paper
Advertisement

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!
Advertisement

Bandla Ganesh Case:చిన్న కమెడియన్ గా కెరీర్ మొదలెట్టి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యాడు.అయితే సినిమాలతో కాకుండా ఒక చెక్ బౌన్స్ కేసులో కావడం ఇక్కడ గమనార్హం. తాజాగా ఒక పాత చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

అయితే కేవలం జైలు శిక్ష మాత్రమే కాకుండా, రూ.95 లక్షల జరిమానా కట్టాలని, అలాగే కేసు విచారణ కోసం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా భరించాలని న్యాయస్థానం స్పష్టంగా ఆదేశించింది కూడా.దీంతో ఈ వార్త ఇలా బయటకు రావడంతో తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది.

Advertisement

అసలు విషయానికి వస్తే 2018లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు బండ్ల గణేశ్.. అయితే కొంతకాలానికి జానకి రామయ్య చనిపోవడంతో, ఆ అప్పు డబ్బులను ఆయన కుటుంబానికి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.

ఈ క్రమంలో జానకి రామయ్య తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేశ్ తన’పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరు మీద రూ.95 లక్షలకు ఒక చెక్ ఇవ్వగా అది కాస్తా డబ్బులు లేక బౌన్స్ అయింది.దీంతో తనకు రావాల్సిన డబ్బుల కోసం వారు కోర్టు మెట్లెక్కగా విచారణ జరిపిన ఒంగోలు కోర్టు తాజాగా బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చేసింది.అయితే, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి కోర్ట్ బండ్లకి నెలరోజుల టైం ఇచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటె తాజాగా ఇదే కోర్టు తీర్పుపై తనదైన శైలిలో స్పందించాడు బండ్ల. భారత న్యాయవ్యవస్థ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ,కింది స్థాయి జిల్లా కోర్టు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయం పొందే హక్కును మన రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లడమే తన నమ్మకమని ఆయన తెలిపారు.అంటే ఈ కోర్టు తీర్పును గౌరవిస్తూనే, పైకోర్టుకు వెళ్లి పోరాడతానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడన్న మాట.

ఇక బండ్ల గణేశ్ సినీ జర్నీగురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో చిన్న చిన్న కమెడియన్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ఆ రవితేజ హీరోగా వచ్చిన ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలను నిర్మించారు.

ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో బండ్ల గణేశ్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయిందనే చెప్పాలి.ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’, ‘టెంపర్’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి పెద్ద సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఏది ఏమైనా గత కొంతకాలంగా ఎదో రకంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతున్న బండ్లన్న తాజాగా మరోసారి చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తుంది. చూడాలి మరి నెల రోజుల్లో హైకోర్ట్ మెట్లెక్కి ఎలాంటి తీర్పుని పొందుతాడో !

also read:నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

Tags

Related News

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

వామ్మో ‘బాయ్స్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా? ఇన్నేళ్లకు బయటపడిందా?

రాముడిపై జావీద్ అఖ్తర్ సంచలన కామెంట్స్.. రగిలిపోతున్న ముస్లిం సంఘాలు!

హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

Big Stories

Advertisement
×