Danush -C.M.Vijay: సినీ నటుడు ధనుష్ త్వరలోనే రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఓం చాప్టర్ 1 (OM Chapter 1)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 20వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా వివిధ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం ఒక రోజు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ధనుష్ (Danush)సినిమాకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సినిమా నవంబర్ 20వ తేదీ విడుదల అవుతున్న నేపథ్యంలో ఉదయం ఆరు గంటల షో కి తమిళనాడు ప్రభుత్వం అనుమతి తెలిపింది.
ఈ విధంగా ఉదయం ఆరు గంటల షో కి అనుమతి లభించడంతో ఈ విషయంపై ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, సీఎం విజయ్(C.M.Vijay) కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ధనుష్ ఒక లేఖ విడుదల చేస్తూ.. సినిమా విజయం అనేది వివిధ భాగాలకు చెందిన ఎంతోమంది సమిష్టి కృషి, అంకిత భావంతో మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి సినీ పరిశ్రమల్లో ప్రతి ఒక్కరికి మీరు అందిస్తున్న ఈ మద్దతు ఏమిటంటే థియేటర్లోకి వెళ్లి సినిమాలను చూడటం సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడటమే.
నవంబర్ 20వ తేదీ విడుదల కాబోతున్న ఓం సినిమా ఉదయం 6:00 షోకి అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయం ఆరు గంటల ఆటకు హాజరయ్యే అభిమానులు కూడా అత్యంత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలని మీ వల్ల ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అంటూ ఈయన అభిమానులను ఉద్దేశించి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. సినిమాను చూసి ఆనందించడమే నిజమైన పండుగ అందరికీ ధన్యవాదాలు అంటూ ధనుష్ ఒక లెటర్ విడుదల చేశారు.
— Dhanush (@dhanushkraja) November 18, 2026
తమిళనాడు ప్రభుత్వానికి ఈయన కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరోవైపు అభిమానులకు కూడా చాలా జాగ్రత్తలు చెబుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుచుకోవాలని సూచించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ధనుష్ జోడీగా శ్రీ లీలా (Sreeleela) నటిస్తుండగా, మమ్ముట్టి జోడిగా రేణు దేశాయ్ సందడి చేయబోతున్నారు. ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) ఐపీఎస్ నిత్యా రెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఈఎన్ఈ రిపీట్ మూవీ ట్విట్టర్ రివ్యూ..తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా?