E-Paper
Advertisement

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Geethanjali Personal Life:గీతాంజలి..తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఆమె.. వందలాది సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఆమె భర్త అయిన జి. రామకృష్ణ కూడా హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే.

అయితే ఈ ఇద్దరి పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలామందికి తెలీదనే చెప్పాలి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో వీరి కొడుకు శ్రీనివాస్ తన తల్లిదండ్రుల గురించి పలు ఆసక్తికర విషయాలను ఇలా చెప్పుకొచ్చారు.

Advertisement

500కు పైగా సినిమాలు.. ఎన్టీఆర్ గుర్తించిన ప్రతిభ!

గీతాంజలి సినీ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైందని మొదట డ్యాన్సర్‌గా సినిమాల్లోకి వచ్చిన ఆమె ప్రతిభను ఎన్టీఆర్ గుర్తించి ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో సీత పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయడం గీతాంజలి జీవితంలో టర్నింగ్ పాయింట్ అని అప్పటికి ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలేనని గుర్తుచేశారు శ్రీనివాస్.

Advertisement

ఆ సినిమాలో సీత పాత్రకు ఆమె ముఖంలోని అమాయకత్వం సరిగ్గా సరిపోతుందని ఎన్టీఆర్ అనుకున్నారట.అలా ఫొటో టెస్టు చేయించి, నటించి చూపించిన తర్వాతే ఆమెను ఎంపిక చేశారని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు శ్రీనివాస్. అంతేకాదు, మొదటిసారి సీత పాత్రకు మేకప్ వేసుకున్నప్పుడు బొట్టు కూడా ఎన్టీఆరే పెట్టారని గర్వంగా చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంతో గీతాంజలికి ఎంతో అనుబంధం ఏర్పడిందని, బాలకృష్ణ, హరికృష్ణలతో చిన్నప్పటి నుంచి కుటుంబ సంబంధాలు ఉండేవని, వాళ్ల ఇంట్లోనే తినడం, ఉండటం వంటివి చేసేవారని చెప్పుకొచ్చారు.ఇక గీతాంజలి కెరీర్ విషయానికి వస్తే తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారని అలా 500కు పైగా సినిమాల్లో గీతాంజలి నటించిందని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి రోజుకు నాలుగు షూటింగుల్లో పాల్గొనేవారని గుర్తుచేసుకున్నారు.

హీరోయిన్‌గా ఉన్నప్పుడే పెళ్లి.. 

గీతాంజలి కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే రామకృష్ణ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారట. అయితే అప్పట్లో గీతాంజలికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని శ్రీనివాస్ చెప్పారు. తన ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి, కుటుంబ బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పేవారని గుర్తు చేసుకున్నారు శ్రీనివాస్.

కానీ గీతాంజలి తండ్రి మాత్రం రామకృష్ణ మంచి హీరో అని, మంచి భవిష్యత్తు ఉందని భావించి ఈ సంబంధాన్ని ఎంకరేజ్ చేయడంతో  వీరి వివాహం జరిగిందని తెలిపారు. అయితే ఇది కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే కాదని, రామకృష్ణకు గీతాంజలి అంటే ఎంతో ఇష్టమని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.తల్లి పద్ధతులు, ఆమె సెన్సిబుల్ మైండ్ తన తండ్రికి బాగా నచ్చేవని చెప్పారు.

నాన్న మొదటి పెళ్లి గురించి 

ఇక రామకృష్ణకు గతంలో పార్వతి అనే నటి పరిచయమైందని, ఇద్దరూ వివాహం చేసుకుని కొంతకాలం కలిసి జీవించారని ఆయన తెలిపారు.అయితే కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని చెప్పారు. ఆ తర్వాత రామకృష్ణ గీతాంజలిని పెళ్లి చేసుకున్నారని వివరించారు. ఈ విషయం గీతాంజలికి, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ముందే తెలుసని క్లారిటీ ఇచ్చారు.

మొదటి పెళ్లి తర్వాత రామకృష్ణ ఆ మహిళకు ఒక ఇల్లు ఇచ్చారని, ఆ ఇంటి నుంచి తాను బయటకు వచ్చేశారని శ్రీనివాస్ తెలిపారు. ఆమెను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని, తనకు తెలిసినంతవరకు ఆమె చివరి వరకు సంతోషంగానే ఉన్నారని చెప్పారు. ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఆస్తులు ఆమె తమ్ముడి పిల్లలకు వెళ్లాయని గుర్తు చేసుకున్నారు.

ఇదే సమయంలో భీమవరంలో మరో పెళ్లి జరిగిందని అనే వార్తలు అంతా అబద్దమని తన తండ్రి జీవితంలో పార్వతితో జరిగిన వివాహం మాత్రమే తనకు తెలిసిన విషయమని స్పష్టం చేశారు.అయితే ఈ విషయాలన్నీ తానూ ఇంట్లో విన్న వాటి ఆధారంగానే చెప్పానని తెలిపారు.

ALSO READ:నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

Tags

Related News

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

వామ్మో ‘బాయ్స్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా? ఇన్నేళ్లకు బయటపడిందా?

Big Stories

Advertisement
×