E-Paper
Advertisement

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!
Advertisement

Bhaja Govindam:’‘ఉన్నంతలో మనకుంతలో బతికితే అదే సుఖం”ఎక్కడ చూసినా ఇపుడు ఈ పాటే తెగ చక్కర్లు కొడుతుంది.కిరణ్ అబ్బవరం స్వంత దర్శకత్వంలో హీరోగా వచ్చిన రియాలిటీ అనే సినిమాలోని భజగోవిందం అనే ఈ పాటని సనారే రాశారు.కోలీవుడ్ ఫేమస్ సింగర్ వైకం విజయలక్ష్మి పాడిన ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది.ఇక ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సనారే ఈ పాట గురించి పలు ఆసక్తి కరమైన విషయాలని చెప్పుకొచ్చారు.

పాట రాయడానికి ప్రత్యేకంగా హోంవర్క్ 

Advertisement

‘భజగోవిందం’ లాంటి ఫిలాసఫీ ఉన్న పాట రాయడానికి ఎలాంటి హోంవర్క్ చేయలేదని, మిగతా పాటలు రాసినట్టుగానే ఈ పాట కూడా రాశానని తెలిపారు. అయితే ఈ పాటలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్,వాళ్ల జీవితాల్లో ఉండే ఫిలాసఫీ రిప్లెక్ట్ అయ్యేలా ఉండటం వల్లే ఈ పాట చాలా మందికి నచ్చిందని వివరించారు.
కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఆ ఒక్క అవకాశం!

ఇక ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఫ్రీడమ్ అని తెలిపారు.మొదటగా భీమ్స్ స్టూడియోకి వెళ్లినప్పుడు పాట ట్యూన్ వినిపించారని, ఆ తర్వాత కిరణ్ అబ్బవరం కారులో దాదాపు 15 నిమిషాలు జర్నీ చేస్తూ ఈ పాటకు సంబంధించిన సిట్యుయేషన్ వివరించారని చెప్పారు.

Advertisement

అంతేకాదు, ఈ క్యారెక్టర్ ఏం చెప్పాలనుకుంటోంది? ఈ సన్నివేశం ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి భావాన్ని అందించాలి? అనే విషయాలను వివరించి, తనకు నచ్చిన విధంగా రాసుకునే స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ లిరిసిస్ట్.

దీంతో సనారే తన ఆలోచనలకు తన జీవిత అనుభవాలను జోడించి పాట రాశానని , మొదటి వెర్షన్ విన్న తర్వాత కిరణ్ అబ్బవరం చాలా సంతోషించారని, అక్కడక్కడ ఒకటి రెండు పదాలు తప్పితే పాటలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పుకొచ్చారు.

వైకం విజయలక్ష్మి గాత్రం.. మరిచిపోలేని అనుభవం

ఈ పాటకు వైకం విజయలక్ష్మి గొంతు మెయిన్ ఎసెట్ అని చెప్పకతప్పదు.అయితే ఆమె పాట పాడుతున్న సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని ఆమె ముందుగా పాటను విని, నేర్చుకుని వచ్చి పాడారని, రికార్డింగ్ సమయంలో చిన్న చిన్న కరెక్షన్లు చెప్పినప్పటికీ ఎంతో మనసుపెట్టి పాడారని గుర్తు చేసుకున్నారు.

‘భజగోవిందం’ అంటే కేవలం భక్తి పాట కాదు

ఇక ఈ పాటలోని ‘భజగోవిందం’ అనే పదం ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన భజగోవింద శ్లోకాల నుంచి తీసుకున్నదని వివరించారు. ఆ పదంలోని భావాన్ని తీసుకుని, దాన్ని ఇప్పటికి మిడిల్ క్లాస్ జీవితాలకి సరిపోయేలా రాసే ప్రయత్నం చేశానని తెలిపారు.

ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి, ఇతరుల కంటే గొప్పగా కనిపించాలి అనే ఆలోచనలు ఉంటాయి. కానీ ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం కూడా ఒక గొప్ప గుణమని ఈ పాట ద్వారా చెప్పాలనుకున్నట్లు వివరించారు సనారే.మొత్తంగా ముప్పై పాటలు రాసినా రాని గుర్తింపు ఈ భజ గోవిందం అనే పాటతో సనారే కి దక్కిందనే చెప్పాలి.

ALSO READ:‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

Tags

Related News

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

వామ్మో ‘బాయ్స్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా? ఇన్నేళ్లకు బయటపడిందా?

రాముడిపై జావీద్ అఖ్తర్ సంచలన కామెంట్స్.. రగిలిపోతున్న ముస్లిం సంఘాలు!

హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

ENE Repeat రిలీజ్‌కు ముందే హీరోయిన్ ఎమోషనల్.. అసలు ఏమైందంటే?

ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

Big Stories

Advertisement
×