Defamation Case on Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాజీ ప్రభుత్వ అధికారి పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రూ. 2 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్గా పరిచయం అవుతూ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‘ అనే వెబ్ సిరీస్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సినిమా తాజాగా వివాదలో నిలిచింది.
ఈ వెబ్ సిరీస్‌పై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారిక సమీర్ వాంఖడే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో తనని తప్పుగా చూపించారని ఆయన ఆరోపిస్తూ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వెబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో చూపించిన ఎసీబీ అధికారికి తనకు దగ్గర పోలిక ఉందని, గతంలో ఆర్యన్ను డ్రగ్ కేసులోనే అరెస్ట్ చేసిన సంఘటనను ఈ సిరీలో చూపించారు. అందులో చూపించిన ఎసీబీ అధికారికి, సమీర్ వాంఖడేకు చాలా దగ్గర పోలికలు కనిపించాయంటూ ఈ సిరీస్ చూసిన నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.
అలాగే సమీర్ వాంఖడే కూడా అలాగే అనిపించడంతో ఆయన న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు ఈ వెబ్ సిరీస్ని నిర్మించిన రెడ్ చిల్లీస్ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో పాటు నెట్‌ఫ్లిక్స్ పై ఆయన రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తూ పరువు నష్టం దావా వేశారు. ఈ సిరీస్లో ఉద్దేశపూర్వంగానే తనని తప్పుగా చూపించారంటూ సమీర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ అనేది షారుక్, ఆయన సతీమణి గౌరీ ఖాన్లు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సరీస్లోనే కావాలనే నన్ను తప్పుగా చూపించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్తలపై ప్రజలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.
Also Read: OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్
రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో ప్రతిపాదించారు. కాగా గత 2021 అక్టోబర్లో ముంబైలో జరిగిన క్రూయిజ్ పార్టీపై జరిగిన దాడి ఘటనలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్తో పాటు పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు ఎన్సీబీ కి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఈ కేసు సమీర్ వాంఖడే లీడ్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ దాదాపు నెల రోజులపైగా జైలులో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై వచ్చాడు. అయితే అప్పుడు అందరికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చే క్రమంలో సమీర్ రూ. 25 కోట్ల వరకు లంచం తీసుకున్న ఆవినీతి ఆరోపణలు రావడంతో ఎన్సీబీ ఆయనతో పాటు పలువురిని సస్పెండ్ చేసింది.