Mega DSC Utsav: గుంటూరు, వెలగపూడి సచివాలయం సమీపంలో టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన 15,941 అభ్యర్థులకు మెగా డీఎస్సీ నియామక పత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ లు మాట్లాడారు.
నేను ఆనాడే చెప్పాను.. ఐటీ చదవమని..
విద్యా వ్యవస్థను మెరుగు పరచడం కోసమే తాను ముందుగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నేను ఆనాడే ఐటీ చదివమని చెప్పాను.. నా మాట విని చదివనవాళ్లు ఇప్పుడు గొప్పు పొజిషన్ లో ఉన్నారు.. మీకు టీచర్ ఉద్యోగం వచ్చింది.. పేదరికం లేకుండా చేసే బాధ్యత మీదే.. సూపర్ సిక్స్ లో మెగా డీఎస్సీ ముఖ్యమైనదే.. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉంది. ఇక ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నా జీవిత కాల గురువు సీఎం చంద్రబాబు: లోకేష్
దేశాధినేత అయిన టీచర్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని మంత్రి నారా లోకేష్ చెప్పారు. తనకు జీవిత కాల గురువు సీఎం చంద్రబాబు అని అన్నారు. టెన్త్ క్లాస్ వరకు నేనే అంతంత మాత్రంగానే చదివే వాడనని గుర్తు చేసుకున్నారు. ఫండమెంటల్స్ లో సరిగ్గా లేనని నారాయణ పాఠాలు చెప్పారని అన్నారు. యూఎస్ఏ వెళ్లినప్పుడు ప్రొ.రాజిరెడ్డి విద్యా వ్యవస్థ గురించి చక్కగ వివరించినట్టు గుర్తు చేసుకున్నారు. వీరి వల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నట్టు చెప్పారు.
యువగళం పాదయాత్రలో యువతను కలిశా..
యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మందిని కలిసినట్టు చెప్పారు. అందులో యువతను కలిసినప్పుడు నిరుద్యోగుల సమస్య గురించి తెలుసుకున్నాని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం అని అప్పుడు నిర్ణయించానని అన్నారు. సీబీఎన్ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే సీబీఎన్.. అని పేర్కొన్నారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపిద్దామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
15 డీఎస్సీల్లో 14 డీఎస్సీలు టీడీపీ హయాంలోనే..
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 15 డీఎస్సీలు జరిగితే.. అందులో 14 డీఎస్సీలు టీడీపీ ప్రభుత్వంలోనే నిర్వహించినట్టు చెప్పారు. టీడీపీ హయాంలో మొత్తం 2 లక్షల మంది టీచర్ల భర్తీని పూర్తి చేశామని అన్నారు. సమిష్టి కృషి వల్లే ఇవాళ మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయ్యిందని వివరించారు. మెగా డీఎస్సీ మెగా హిట్ అయ్యిందని పేర్కొన్నారు.
150 కేసులు పెట్టినా.. 150 రోజుల్లోనే?
150 రోజుల్లో 150కి పైగా కేసులు వేసినా నియామకాలను సజావుగా పూర్తి చేశామన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. విద్యను రాజకీయాలకు దూరం పెట్టినట్టు వివరించారు. నవంబర్ నెలలో మరోసారి టెట్ ఎగ్జామ్ పెడతాం.. వచ్చే ఏడాది మళ్లీ డీఎస్సీ పరీక్ష ఉంటుంది.. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సి అవసరం ఎంతో ఉంది. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపిద్దామని అన్నారు.. ఫిన్ లాండ్, సింగపూర్‌లో విద్యా వ్యవస్థపై మనం అధ్యయనం చేయాల్సి అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ వివరించారు.
ALSO READ: SSC Constable: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.81,000 జీతం.. ఇదే మంచి అవకాశం బ్రో