Kaka Movie: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబి కొల్లి దర్శకత్వంలో రాబోతున్న కాకా సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకోవడంతో ప్రమోషన్ లో బాట పట్టబోతున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది.. మరి ‘కాకా’ మూవీ నుంచి వచ్చిన ఆ అప్డేట్ ఏంటి అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబి కొల్లి దర్శకత్వంలో గతంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది.. ఇప్పుడు కాకా సినిమా వీళ్లిద్దరు కాంబినేషన్లో రాబోతున్న రెండో సినిమా. ఇప్పటికే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చేసింది. అంతేకాదు ప్రమోషన్స్ గురించి కూడా ఒక వార్త వినిపించడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి, ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించే ఉద్దేశంతో చిత్ర యూనిట్ఉన్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ ఒకటో తారీకు నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అయితే ముందుగా ఈ సినిమా నుంచి పాటలను ఆ తర్వాత టీజర్ ట్రైలర్లను ఒక్కొక్కటిగా వదులుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్.. మరి దీనిపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.
చిరంజీవి సినిమాలలో ఈ మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ప్రేక్షకులు ముందుకు వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కూడా ఫ్యామిలీ డ్రామాగా రావడంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలిగిన ఎపిసోడ్ ఒకటి హైలెట్‌గా నిలవనుందని టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ ఈ సినిమాను 2027 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవ్వగా, సినిమా కోసం ఫాన్స్ ఈగరగా వెయిట్ చేస్తున్నారో మరి సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో అన్నది తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..