Ramayana OTT: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించిన భారతీయ ఇతిహాస కావ్యం రామాయణం. హిందూమతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించగా అందులో భాగంగానే.. ఈ సినిమా మొదటి భాగాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. సుమారుగా తెలుగు వెర్షన్ హక్కుల కోసం రూ.54 కోట్లకు పైగా అడ్వాన్స్ పద్ధతిలో చెల్లించి, ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్కును దాటిన నేపథ్యంలో హైదరాబాదులో జరిగిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు ఓటీటీ విడుదలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
దిల్ రాజు మాట్లాడుతూ.. వారు అంత పెద్ద చిత్రాన్ని తీశారు. పైగా చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఏ ఓటిటి , సాటిలైట్ కి అమ్మలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితం. ముఖ్యంగా వాళ్లు అసలు ఓటీటీకి, శాటిలైట్ కి హక్కులను అమ్ముతారో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలి అంటూ దిల్ రాజు స్పష్టం చేశారు. మొత్తానికైతే ఈ ఇతిహాస కావ్యం ఓటీటీలో వస్తుంది.. చూడొచ్చులే అని అనుకున్న అభిమానులకు పూర్తి నిరాశ కలిగించారని చెప్పవచ్చు.
ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ దక్కించుకుందని థియేటర్ రన్ పూర్తయ్యాక.. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా డిజిటల్ ప్రీమియర్ నిర్మాతల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
also read:రమ్యకృష్ణ కెరియర్ లోనే మర్చిపోలేని సినిమా ఏంటో తెలుసా?
ఇకపోతే ఇదే విలేకరుల సమావేశంలో ఈ సినిమాలో సీత పాత్రను ఒక యోధురాలిగా చిత్రీకరించడం పై వచ్చిన విమర్శలపై కూడా దిల్ రాజు స్పందించారు. నితీష్ తివారీ దర్శకత్వంలో మనీష్ మల్హోత్ర నిర్మాణంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సుమారుగా 4వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించడం గమనార్హం. ఇక ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ , సాయి పల్లవిగా సీత అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అటు మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్, కైకేయి పాత్రలో లారాదత్త ఇలా ప్రతిపాత్రలోనూ ఒక స్టార్ సెలబ్రిటీ నటించడం గమనార్హం.