Sruthi Hassan -Suhasini: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారితో శృతిహాసన్ (Sruthi Hassan) ఒకరు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే శృతిహాసన్ ఇటీవల హీరోయిన్గా మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే శృతిహాసన్ నటించిన ఆకాశంలో ఒక తార అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 20 వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు వరసకు అక్క అవుతున్న సీనియర్ నటి సుహాసిని(Suhasini)తో కలిసి ఒక చిట్ చాట్ చేశారు. ఇలా సుహాసినితో కలిసి ఎన్నో ఆశక్తి కరమైన విషయాలను పంచుకున్న శృతిహాసన్ ఎవరు ఊహించిన విధంగా సుహాసిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుహాసిని శృతిహాసన్‌ని ప్రశ్నిస్తూ నీ పెళ్ళెప్పుడు అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెప్పకపోగా ఏమాత్రం మొహమాటం లేకుండా తడబాటు లేకుండా నీ విడాకులు(Divorce) ఎప్పుడు అంటూ ప్రశ్నించారు.
ఇలా మణిరత్నం(Maniratnam) గారి నుంచి మీరెప్పుడు విడాకులు తీసుకుంటున్నారు అంటూ శృతిహాసన్ ప్రశ్నించడంతో ఒక్కసారిగా సుహాసిని షాక్ అయ్యారు. ఇలా శృతిహాసన్ విడాకుల గురించి ప్రశ్నించడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలు ఏంటని కూడా సుహాసిని ప్రశ్నించారు. శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలోకి రావడాన్నీ మీరెలా ఒప్పుకున్నారు అంటూ ఓ సందర్భంలో ఒక వ్యక్తి నాన్నని అడిగారని శృతిహాసన్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రశ్నకు తన తండ్రి కమల్ హాసన్ గారు చెప్పిన సమాధానం వినితాను షాక్ అయ్యానని శృతి తెలిపారు.
కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఏమీ తెలియని ఒక కుటుంబంలోకి మీ కూతుర్ని పెళ్లి చేసి పంపిస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీకి మా ఫ్యామిలీ, మా కుటుంబంలో నా కూతురు చాలా హ్యాపీగా ఉంటుందని కమల్ హాసన్ బదులు ఇచ్చినట్టు ఈ సందర్భంగా శృతి తెలిపారు. సినిమా ప్రపంచాన్ని తన తండ్రి ఎలా చూస్తారో చెప్పడానికి ఇంత కంటే ఏం నిదర్శనం లేదని శృతి హాసన్ తెలిపారు.ఇక సుహాసిని స్వయంగా కమల్ హాసన్ అన్న కూతురు అనే సంగతి తెలిసిందే.ఇక శృతి హాసన్ గత ఏడాది కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ ఏడాది ఆకాశంలో ఒక తార అనే సినిమా ద్వారా రాబోతున్నారు ఈ సినిమాతో పాటు తమిళంలో ట్రైన్ అనే సినిమాలో నటిస్తున్నారు.
Also Read: త్రిగుణ్ ఎస్ జె సూర్య లాంటోడు.. మిథిలేష్ 15 లక్షలపై హైపర్ ఆది కౌంటర్!