Shruti Haasan: ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, అద్భుతమైన నటనతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలు మరొకవైపు పలు ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్న శృతిహాసన్.. తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒకవైపు వరుస ప్రమోషన్లలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఇంట్లో బొమ్మ కదులుతోందని, ఆ బొమ్మలో ఏదో అతీంద్రియ శక్తి ఉందని తెలిసి భయంతో అలాంటి పని చేశాను అంటూ కామెంట్లు చేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.శృతిహాసన్ మాట్లాడుతూ..” నేను ఉంటున్న నా ముంబై ఇంట్లో “ఫియోనా” అని పేరు పెట్టుకున్న ఒక మనిషి ఆకారపు బొమ్మను తీసుకొచ్చాను. దానికి బట్టలు కూడా వేసాను. అయితే ఆ బొమ్మ తానంతట తానుగా స్థానాలు మార్చుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నేను ఒంటరిగా ఉండడం, పైగా ఆ బొమ్మ నా పెంపుడు పిల్లి కూడా కదిలించేంత తేలికైనది కాకపోవడంతో నాకు మరింత భయాన్ని కలిగించింది. ముఖ్యంగా ఈ సంఘటన నాకు హాలీవుడ్ మూవీ ‘ఐయామ్ లెజెండ్’ ను గుర్తుచేసింది” అంటూ శృతిహాసన్ తెలిపింది.
ఇక వెంటనే ఇంట్లో హనుమాన్ చాలీసా ప్లే చేసి, చేతిలో ఉప్పు పట్టుకొని మరీ ఆ బొమ్మను డిస్ మ్యాండిల్ చేసి ఇంటి నుండి బయట పడేసాను. ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసి, తలుపులు మూసేశాను.ప్రస్తుతం ఆ బొమ్మను తొలగించి, ఇంటిని శుద్ధి చేసినప్పటి నుంచి నా ముంబై ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా నాకు ఏదైనా ఒక ప్రదేశంలో వింత శక్తులు ఉంటే త్వరగా తెలుస్తుంది. అయితే చెన్నై ఇల్లు ప్రశాంతంగా ఉన్నా.. ముంబై ఇంట్లో మాత్రం ఏదో అనుమానాస్పదంగా అనిపించింది “అంటూ శృతిహాసన్ తెలిపింది. ఇక శృతిహాసన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ఇది దెయ్యం తాలూకా పనులు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శృతిహాసన్ ను భయపెట్టిన ఈ ఘటన అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
also read: వింటర్ లో హీటెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న అవంతిక!
శృతిహాసన్ ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తున్నారు.అలాగే ఇందులో దుల్కర్ సల్మాన్ సాత్విక వీరవల్లి జంటగా నటిస్తున్నారు. అలాగే తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చెన్నై కథ తో పాటు సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం వంటి చిత్రాలలో నటిస్తున్న ఈమె మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్లు సమాచారం.