Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్న ఈయన సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు . తాజాగా మహేష్ బాబు చిన్నప్పుడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (Krishna)గారితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
నేడు తన తండ్రి కృష్ణ గారి వర్ధంతి కావడంతో తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇలా తన తండ్రి చిన్నప్పుడు తనని చేసుకొన్నటువంటి ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు ..నా జీవితంలో ఎప్పటికీ నువ్వే సూపర్ స్టార్ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటో మహేష్ బాబు బాల నటుడిగా నటించిన మొదటి సినిమా పోరాటం సినిమాలోని ఫోటో కావటం విశేషం. ఇలా మహేష్ బాబు ఈ ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు చిన్నప్పుడు కూడా అదే క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ 2022 సంవత్సరం నవంబర్ 15వ తేదీ వయసు పై పడటంతో మరణించిన సంగతి తెలిసిందే . ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా తరువాత రాజమౌళి (Rajamouli) సినిమా పనులలో బిజీ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మొట్టమొదటిసారి నటిస్తున్న చిత్రం వారణాసి(Varanasi). ఈ సినిమా పై గ్లోబల్ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. మహేష్ బాబు మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, విలన్ పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
Also Read: మణిరత్నం గారితో మీ విడాకులు ఎప్పుడూ.. శృతిహాసన్ ప్రశ్నకు షాక్ అయిన సుహాని