Ntr Look : స్టార్ హీరోలు సినిమా సినిమాకి లుక్కు మార్చడం కామన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల కాలంలో ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి రెడీ అయిపోతుంటారు. గత కొద్దిరోజులుగా సినిమా హీరోలకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు వరుసగా సినిమాలన్నీ లైన్లో పెట్టుకుంటూ బిజీగా మారుతూ ఉంటారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డ్రాగన్ సినిమా ఉండగానే.. మరొక సినిమాకి రెడీ అవుతున్నాడు. దానికి తగ్గట్లుగానే ఆయన లుక్కు కూడా ఉండడంతో అభిమానులు నెక్స్ట్ సినిమాపై క్యూరియాసిటీతో ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ మరో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో ఫ్యాన్స్ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నా ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు డిఫరెంట్ కథతో పాటుగా డిఫరెంట్ లుక్ కూడా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ కొత్త లుక్ పై అనేక రూమర్స్ కూడా వినిపించాయి. తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ గురించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కాస్త సన్నబడిన సంగతి తెలిసిందే అది చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కానీ లేటెస్ట్ గా మళ్ళీ తారక్ లుక్ బయటకి వచ్చి డ్రాగన్ లో ఇంకో షేడ్ కోసం ఇది సిద్ధం చేస్తున్నారా అనేలా మారింది. మరి ఎన్టీఆర్ సినిమాలో ఎలా కనిపిస్తున్నాడు అన్న ప్రశ్న ఇప్పుడు ఫాన్స్ లో ఆసక్తిని నెలకొల్పింది..
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా చేయాల్సిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు అనిల్ రావిపూడి తో మరొక సినిమా చేయబోతున్నాడు అని ఒక వార్త వినిపిస్తుంది. అనీల్ రావిపూడితో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అప్డేట్ లో తారక్ లుక్ ఫ్రెష్ గా డ్రాగన్ నుంచి కొంచెం డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. తారక్ ఇపుడు మరింత బలిష్టంగా కనిపిస్తూ ఫ్యాన్స్ కి కొత్త కిక్ ని ఇచ్చాడు.. ఏది ఏమైనా కూడా సినిమా సినిమాకి ఎన్టీఆర్ లుక్కు కూడా పూర్తిగా మారిపోతుంది అని అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.. అనిల్ రావిపూడి సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు అన్న ఆసక్తి ఇప్పటినుంచే నెలకొంది.. మరి ఎన్టీఆర్ కోసం డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు ఎలాంటి కథను సిద్ధం చేశారో అన్ని టాలీవుడ్ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. త్వరలోనే ఈ స్టోరీ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..
Also Read :మీనా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? వాట్ ఏ క్రేజ్ మావా..