E-Paper
Advertisement

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్!

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్!
Advertisement

Ashika Ranganath: ప్రముఖ యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ, తమిళ్ భాష చిత్రాలలో నటిస్తూ మరింత బిజీగా మారిన ఈమె.. తొలిసారి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత నా సామిరంగా చిత్రంలో వరమహాలక్ష్మి అలియాస్ వరాలు పాత్రతో మరోసారి అలరించింది. చివరిగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఆషిక..

ఇదిలా ఉండగా అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా ప్రముఖ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాకా (Raaka ) సినిమాలో ఈమె కూడా కీలకపాత్ర పోషిస్తుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా ఈ విషయంపై స్వయంగా ఆషికా రంగనాథ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా అల్లు అర్జున్తో కలిసి దిగిన ఒక ఫోటోని ఆమె షేర్ చేస్తూ..” మీతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. అల్లు అర్జున్ మళ్ళీ కలుద్దాం.. అయితే ఈసారి ఒక సినిమా సెట్ లో కలుద్దామని ఆశిస్తున్నాను” అంటూ ఆమె పోస్టు పెట్టింది.

రాకా? లోకేష్ కనగరాజ్ మూవీ?

Advertisement

మొత్తానికైతే ఆషికా రంగనాథ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడు అల్లు అర్జున్ రాకా చిత్రంలో అవకాశం దక్కించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజంగానే రాకా సినిమాలో ఈమె భాగం కాబోతోందా? లేక లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రాబోయే చిత్రంలో అవకాశం అందుకుందా? అనే విషయం పై స్పష్టత రాలేదు. ఏది ఏమైనా తన అద్భుతమైన నటన ప్రతిభతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఆషిక ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ప్రశంసనీయమని చెప్పాలి.

రాకా మూవీ విశేషాలు..

రాకా మూవీ విషయానికొస్తే.. అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా తెలుగు చిత్రం ఇది . సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది . ఈ సినిమాలో రష్మిక మందన్న విలన్ పాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా తారాగణం పై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

Advertisement

also read: ఇంట్లో దెయ్యం.. భయంతో అలాంటి పని చేశానంటున్న శృతిహాసన్!

ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ..

ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటూనే.. మరొకవైపు నేడు హైదరాబాదులో జరుగుతున్న ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో రాకా వైపే అందరి దృష్టి ఒక్కసారిగా మళ్ళింది. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని చెబుతారా? షూటింగ్ ఎంతవరకు పూర్తయింది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది ? వంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.ఈ చిత్రంలో మృనాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Related News

ఇంట్లో దెయ్యం.. భయంతో అలాంటి పని చేశానంటున్న శృతిహాసన్!

ఎప్పటికీ నువ్వే నా సూపర్ స్టార్… తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ ఎమోషనల్!

వింటర్ లో హీటెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న అవంతిక!

మణిరత్నం గారితో మీ విడాకులు ఎప్పుడూ.. శృతిహాసన్ ప్రశ్నకు షాక్ అయిన సుహాని..

రామాయణ మూవీను థియేటర్లలోనే చూడాలా.. ఓటీటీలోకి రాదా?

రమ్యకృష్ణ కెరియర్ లోనే మర్చిపోలేని సినిమా ఏంటో తెలుసా?

భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×