Avantika Mishra:ఇటీవల కాలంలో హీరోయిన్స్ మత్తెక్కించే గ్లామర్ ఒలకబోస్తూ షేర్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే అందం, అభినయంతో మరోసారి ఈ వింటర్లో కుర్రకారుకు హీటెక్కించే ఫోజులు ఇస్తూ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఆమె ఎవరో కాదు అవంతిక మిశ్రా (Avantika Mishra) న్యూఢిల్లీకి చెందిన ఈమె బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ , కేవీ హెబ్బాల్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది . బెంగళూరులోని బసవనగుడిలో ఉన్న బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె.. ఆ తర్వాత మోడలింగ్ అసైన్మెంట్ల కోసం చాలా ప్రయాణించింది.

అయితే ఈ ప్రయాణం ఆమెకు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అలా మోడలింగ్ లో ఆరు నెలల పాటు కొనసాగిన ఈమె.. ఆ తర్వాత తెలుగు చిత్రం ‘మాయ’తో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో తరుణ్ భాస్కర్ దాస్యం, వాణి బోజన్ లతో కలిసి కనిపించింది.

ఆ తర్వాత డి బ్లాక్ లో కథానాయికగా కనిపించిన ఈమె.. ‘మీకు మీరే మాకు మేమే’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. పలు వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలలో కూడా సందడి చేసింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అవంతిక మిశ్రా తాజాగా అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

also read:రామాయణ మూవీను థియేటర్లలోనే చూడాలా.. ఓటీటీలోకి రాదా?
ఫ్రంట్ డీప్ వీ నెక్ కలిగిన వెల్వెట్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె.. ఇందులో ఘాటు మిర్చిలా సెగలు రేపుతూ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక అవంతిక లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
