BigTV English

Fahadh Faasil : ఆ సినిమా గురించి మాట్లాడను, పుష్పపై ఫహద్ వ్యాఖ్యలు.?

Fahadh Faasil : ఆ సినిమా గురించి మాట్లాడను, పుష్పపై ఫహద్ వ్యాఖ్యలు.?

Fahadh Faasil : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేక్షకులు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఎంతలా ప్రేమిస్తారో అందరికీ తెలుసు. అందుకే చాలామంది తమిళ్ హీరోలు ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో మలయాళం హీరోలకు కూడా మంచి పేరు వస్తుంది. దుల్కర్ సల్మాన్ ఏకంగా తెలుగులో మూడు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు.


మలయాళం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఫహద్ కెరీర్ లో ఉన్నాయి. ఓటిటిలో చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫహద్ సినిమాలు చూసి అభిమానులు అయిపోయారు. ఇక పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు కూడా వచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. పుష్ప 2 ఏకంగా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది.

పుష్ప పైనే వ్యాఖ్యలా.?


పుష్ప సినిమా ప్రమోషన్స్ లో ఫహద్ ఫాజల్ ఎక్కడా కనిపించలేదు. దీనిని బట్టి అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. అయితే దీనికి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. ఫహద్ మాట్లాడుతూ… నేను గత సంవత్సరం నుంచి ఒక పెద్ద సినిమాలో ఫెయిల్ అయ్యాను. ఆ సినిమా గురించి నేను మాట్లాడను. కానీ ఏదైనా మీ కంట్రోల్ లో లేకుండా జరుగుతుంది అంటే దాన్ని వదిలేయడం బెటర్. అని ఫహద్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనిని బట్టి ఫహద్ గత సంవత్సరంలో చేసిన పెద్ద సినిమా ఏదైనా ఉంది అని అంటే కేవలం పుష్ప 2 మాత్రమే. బహుశా అప్పుడు సినిమా ప్రమోషన్ కి రాకపోవడం, ఇప్పుడు ఇంటర్వ్యూ బట్టి చూస్తే ఇదే అసలైన కారణం అని అర్థమవుతుంది.

ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విపరీతమైన సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా బాహుబలి రికార్డ్స్ కూడా ఈ సినిమా కొల్లగొట్టింది. దీనికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు. ఏదేమైనా పుష్ప సినిమా మీద ఉన్న హైప్ ఈ సీక్వెల్ కి పనికొచ్చింది. మొదటి షో పడిన వెంటనే సినిమా మీద విపరీతమైన పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలానే మౌత్ టాక్ కూడా బాగా రావడంతో సినిమా మంచి కలెక్షన్స్ తో ముందుకెళ్లింది. ఈ సినిమా విషయంలో ఫహద్ ఫాజల్ డిసప్పాయింట్ గా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫహద్ మాటలు వింటుంటే అది నిజమేమో అని అనిపిస్తుంది.

Also Read: Vishwambhara : విశ్వంభర లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్, సెట్స్ నుంచి అదిరిపోయే ఫోటో

Related News

Kalki 2898 AD: ప్రభాస్‌తో ముదిరిన వివాదం… కల్కీ 2 నుంచి దీపికా పదుకొణె అవుట్

Manchu Lakshmi: కుటుంబంలో గొడవలు.. నేను సైలెంట్ గా ఉండడానికి కారణం అదే

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ కు బర్త్ డే .. ఉపేంద్ర పోస్టర్ రిలీజ్

Allu vs Mega :పాన్ ఇండియా మెగాస్టార్ గా బన్నీ.. కథ సుఖాంతం అనుకుంటే.. మళ్లీ మొదలెట్టారే..

Fauji Movie : ‘ఫౌజీ’ లో బాలీవుడ్ బడా హీరో.. డైరెక్టర్ ప్లానింగే వేరప్పా..

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Big Stories

×