Vishwambhara : మొదటి సినిమా బింబిసార తో అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు వశిష్ట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయనను చూసి నటులు అవ్వాలి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే ఆయనతో సినిమా చేయాలి అనే కలలకు అనే దర్శకులు కూడా ఉన్నారు. చాలామంది స్టార్ డైరెక్టర్ కు ఆ కల నెరవేరలేదు. త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులుతో సినిమాలు అనౌన్స్ చేసి కూడా జరగని సందర్భాలు ఉన్నాయి.
ఇక రెండవ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు వశిష్ట. అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కనుంది. మెగాస్టార్ ఈ జోనర్ లో సినిమా చేసి చాలా ఏళ్లయింది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ కథను కూడా చెప్పాడు వశిష్ట. కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక మెగాస్టార్ ను సినిమాలో ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.
సెట్స్ నుంచి అదిరిపోయే ఫోటో
విశ్వంభర సినిమాకి సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించి కేవలం ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ నేడు అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్ కలిసి ఈ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మెగాస్టార్ స్వాగ్ గమనించొచ్చు. మెగాస్టార్ ఫేస్ రివిల్ చేయకపోయినా కూడా చాలా స్టైలిష్ గా సెట్స్ లో నిలబడి ఉన్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Freezing this moment to celebrate later ❤️
A Dance Storm that'll make you BOSS-fied Shuruuuu 💥 🤙#Vishwambhara – Last Schedule begins! pic.twitter.com/rlAi8KQLfM
— Vassishta (@DirVassishta) July 25, 2025
విఎఫ్ఎక్స్ కూడా దాదాపు పూర్తయింది
బింబిసారా సినిమా విఎఫ్ఎక్స్ తో కూడుకొని ఉంటుంది. అలానే విశ్వంభరా సినిమా కూడా విఎఫ్ఎక్స్ కీలకం. దాదాపు 60 శాతం ఈ సినిమా విఎఫ్ఎక్స్ తోనే ఉంటుంది. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయిపోయినట్లు దర్శకుడు వశిష్ట తెలిపారు. ఈ పాట అయిపోయిన వెంటనే, కేవలం రెండు రోజులు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ను అధికారకంగా అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతానికి సెప్టెంబర్ లో వస్తుంది అనేది కొంతమంది అంటున్నారు. డిసెంబర్ ని కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read: Shruti Haasan : ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అప్పట్లో ఓటిటి లు పాన్ ఇండియాలు లేవు