హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో బాగా డెవలప్ అవుతోంది. ఆధునిక మౌలిక సదుపాయాలు పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్ నిపుణులు, విద్యార్థులు నగరానికి తరలి వస్తున్నారు. ఫలితంగా అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే, అవసరమైన సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా సౌకర్యవంతమైన జీవనశైలిని అందించే అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తూర్పు హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఐటీ హబ్, తార్నాక (6 కి.మీ), పోచారం (13 కి.మీ) లాంటి ప్రాంతాలకు మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. రద్దీగా ఉండే నగర కేంద్రం నుంచి ప్రశాంతమైన, విశాలమైన జీవన వాతావరణాన్ని కోరుకునే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి విద్యార్థులు, నిపుణులలో ఉప్పల్ లో ఉండవచ్చు. ఉప్పల్‌కు మెట్రో స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ కేవలం 10 కి.మీ దూరంలో ఉంది. ఉప్పల్ లో సింగిల్ బెడ్ రూమ్ రెంట్ రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ రెంట్ రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ రూ. 17 వేల నుంచి రూ. 18 వేల వరకు లభిస్తుంది.
రాజ్ భవన్ ఉన్న సోమాజిగూడ వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో బోలెడు నివాస స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీతో, సరసమైన అద్దె ఇళ్లను కోరుకునే వారికి సోమాజిగూడ ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ రూ. 21-26 వేలు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ రూ. 21-26 వేలు ఉంటుంది.
ఒకప్పుడు గ్రామంగా ఉన్న మియాపూర్ ఇప్పుడు హైదరాబాద్ లో కలిసిపోయింది. నగర కేంద్రం నుంచి దాదాపు 22 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్‌లో అత్యంత సరసమైన గృహ ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ రూ. 12-15 వేలు ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ రూ. 19-24 వేలు ఉంటుంది. ట్రిపుల్ బెడ్ రూమ్ రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు లభిస్తుంది.
బేగంపేట కీలకమైన వాణిజ్య, నివాస కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇది ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పచ్చదనంతో కూడిన విశాలమైన రోడ్లను కలిగి ఉంటుంది. హైదరాబాద్‌లో సరసమైన జీవనానికి అనుకూలంగా ఇళ్లు అద్దెకు లభిస్తాయి. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ రూ. 10-12 వేల వరకు లభిస్తుంది. డబుల్ బెడ్ రూమ్ రూ. 20-25 వేల వరకు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ రూ. 35-40 వేలు ఉంటుంది.
హైదరాబాద్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉంటుంది మణికొండ. లాంకో హిల్స్, టెక్ పార్క్ కు దగ్గరగా ఉంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, NH-4, NH-7, NH-9 లాంటి రహదారులకు కనెక్టివిటీని అందిస్తుంది. టెక్ నిపుణులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ రూ. 15-40 వేలు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ రూ. 50 నుంచి రూ. 60 వేలు ఉంటుంది.
అమీర్‌పేట.. బేగంపేట, బంజారా హిల్స్ లాంటి కీలక ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంటుంది. చౌకైన అద్దె ఇళ్ల కోసం చూస్తున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అమీర్ పేట అనేక సాఫ్ట్ వేర్ శిక్షణా సంస్థలతో నిండి ఉంది. ఇది IT నిపుణులకు గమ్యస్థానంగా మారింది. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ ధర రూ. 10-15 వేలు ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ రూ. 20-25 వేలు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ రూ. 50 నుంచి 1 లక్ష వరకు ఉంటుంది.
టెక్ నిపుణులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. మాదాపూర్ అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలకు సమీపంలో ఉండటంతో ఇది సరైన ఎంపికగా భావిస్తారు. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ రెంట్ రూ. 15-30 వేలు ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ రెంట్ రూ. 20 నుంచి 45 వేలు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ రెండ్ రూ. 35 నుంచి 80 వేల వరకు ఉంటుంది.
కొండాపూర్… హైటెక్ సిటీ, గచ్చిబౌలి మధ్యలో ఉంటుంది. ఇక్కడ సైబరాబాద్ IT జోన్‌లో పనిచేసే వారికి అనువైన ప్రాంతంగా ఉంది. గూగుల్ తో సహా ప్రధాన కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ ధర రూ. 10-25 వేలు ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ ధర రూ. 15-60 వేలు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ ధర రూ. 30 వేల నుంచి రూ. 1 లక్ష వరకు ఉంటుంది.
కూకట్‌పల్లి.. హైటెక్ సిటీ, గచ్చిబౌలికి సమీపంలో ఉండటం వల్ల ఐటీ నిపుణులు దీనిని ప్రత్యేకంగా ఇష్టపడతారు. ఈ ప్రాంతంలో బోలెడు ఆఫీస్ లు, కమర్షియల్ ప్లేసెస్, చిన్న ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. పక్కనే కొత్తగూడ, నిజాంపేట్, జూబ్లీ హిల్స్, చందా నగర్, మోతీ నగర్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ రెంట్ రూ. 15-25 వేల వరకు ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ రూ. 12 నుంచి రూ. 30 వేలు ఉంటుంది. ట్రిఫుల్ బెడ్ రూమ్ ధర రూ. 30 నుంచి రూ. 40 వేలు ఉంటుంది.
Read Also: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?