OG Movie: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ఓజీ సినిమా(OG Movie) మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రీమియర్లకు అనుమతి లభించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ చూడటం కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇక నేడు రాత్రి పది గంటలకు ప్రీమియర్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు హీరోలు అందరూ కూడా ఓజీ సినిమాకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి జ్యోతి పూర్వజ్(Jyothi Poorvaj) సైతం పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో ఆమె విభిన్న రీతిలో ఓజి సినిమా అని ప్రమోట్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈమె తనలో దుస్తుల మీద ఓజీ అని ప్రింట్ వేయించుకొని హాట్ లుక్ లో ఫోటోలకు ఫోజులిస్తూ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
భారతీయ మహిళ అంటే అర్థం ఇదేనా?
ఇలా జ్యోతి పూర్వజ్ ఓజీ సినిమాని ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఈమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యతిరేకత రావడమే కాకుండా ఈమె చర్యలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఓజీ సినిమా ప్రమోషన్ల కోసం మరీ ఇంతలా దిగజారి పోవాలా? భారతీయ మహిళ అంటే అర్థం ఇదేనా? అంటూ ఈమెపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హీరో పట్ల అభిమానం ఉంటే వారి అభిమానాన్ని విభిన్న రీతిలో చాటుకోవచ్చు కానీ ఇలా ఒక మహిళ అయి ఉండుకొని మహిళ లోకాన్నే అవమానపరిచే విధంగా ఉండకూడదు అంటూ పలువురు విమర్శలు కురిపిస్తున్నారు
అర్ధ నగ్న మహిళ చిత్రాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన చిత్ర ప్రచారం..
భారతీయ మహిళ అంటే ఇదేనా అర్ధం?#SanatanaDharmama #OG #TheycalllHimOG#PawanKalyan #AndhraPradesh pic.twitter.com/6ohDUrkhYu
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 24, 2025
పవన్ పై అభిమానంతో విభిన్న రీతిలో ఈమె ప్రమోషన్లను నిర్వహించడంతోనే చిక్కుల్లో పడ్డారు. మరి ఈ విమర్శలపై నటి జ్యోతి రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమే. తెలుగులో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి విపరీతమైన తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈమెకు పెద్ద ఎత్తున కన్నడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు.. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు పిల్లలా హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.
Also Read: Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు