IND vs BAN: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia cup 2025) భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బలమైన టీమిండియా జట్టుకు… పనికూన బంగ్లాదేశ్ చుక్కలు చూపించింది. పాకిస్థాన్ తో సులభంగా గెలిచిన టీమిండియా… బంగ్లాదేశ్ ప్లేయర్ల దెబ్బకు కాస్త తలవంచింది. అయితే చివరిలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. గ్రూప్ స్టేజీలో మూడు విజయాలు సాధించిన టీమిండియా…సూపర్ ఫోర్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లా దేశ్ జట్టుపైన 41 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
బ్యాటింగ్ లో పెద్దగా రానించని టీమిండియా… బౌలింగ్ లో మాత్రం అదరగొట్టింది. పసి కూన బంగ్లాదేశ్ జట్టు పైన టీమ్ ఇండియా బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. కులదీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా… బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. అక్సర్ పటేల్ ఒక వికెట్ తీయగా మరొకరు రన్ అవుట్ అయ్యారు. అటు తిలక్ వర్మ కూడా మరో వికెట్ తీశాడు. దీంతో 19.3 ఓవర్స్ లో.. 127 పరుగులు మాత్రమే చేసి… ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్. దీంతో ఆసియా కప్ ఫైనల్ కు టీం ఇండియా చేరుకుంది. శ్రీలంక ఇంటిదారి పట్టింది. బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ రెండిటిలో ఒక జట్టు ఫైనల్ కి వస్తుంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia cup 2025) భాగంగా ఇవాళ జరిగిన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో విలన్ సూర్య కుమార్ యాదవ్ మారిపోయారు. ఆయన కారణంగా టీమిండియా భారీ స్కోర్ చేయలేదని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒమాన్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయని సూర్య కుమార్ యాదవ్…ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను పూర్తిగా మార్చేశారు. దీంతో టీమిండియా 200 నుంచి 250 వరకు పరుగులు చేసే ఛాన్సు ఉండేది. కానీ సంజూ శాంసన్ ను ఇవాళ్టి మ్యాచ్ లో ఆడించలేదు సూర్య కుమార్ యాదవ్. అక్షర్ పటేల్ లాంటి అప్పుడప్పుడు పేలే ఆల్ రౌండర్ ను బ్యాటింగ్ కు దింపారు కానీ… సంజూ శాంసన్ లాంటి భయంకరమైన ప్లేయర్ ను బరిలోకి దించలేదు.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి… మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. అత్యత్ప స్కోరు చేసింది టీమిండియా. 200 నుంచి 250 పరుగులు చేయాల్సిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి కేవలం 168 పరుగులు మాత్రమే చేసింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 75 పరుగులు చేయగా.. గిల్ 29 పరుగులు చేశాడు. చివరలో హర్ధిక్ పాండ్యా 38 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. లేకపోతే ఆ మాత్రం స్కోర్ చేసిది. ఈ ముగ్గురు రాణించడంతో.. టీమిండియా బయటపడింది.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా