BigTV English

Garividi Lakshmi : గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్, సరికొత్త పాత్రలో ఆనంది

Garividi Lakshmi : గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్, సరికొత్త పాత్రలో ఆనంది

Garividi Lakshmi : తెలుగు ప్రేక్షకులు మంచి కథలకు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలా చిన్న కాన్సెప్ట్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఆదరణ పొంది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. అలానే కథా బలం ఉన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కేరాఫ్ కంచరపాలెం, బలగం వంటి సినిమాల్లో పెద్ద పెద్ద నటులు నటించకపోయినా కథలో ఉన్న బలం వలన ప్రేక్షకులు ఆయా సినిమాలను భుజాలపై మోసారు.


అందుకే చాలామంది దర్శక నిర్మాతలు మంచి కథలను ప్రేక్షకులకు చెప్పడానికి తాపత్రయ పడుతూనే ఉంటారు. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్త్రీ కోణంలో కథలు చెప్పే సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఈ మధ్యకాలంలో అటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి సినిమాలు వస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీ గానే ఉంటారు. దానికి మంచి ఉదాహరణ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి.

గరివిడి లక్ష్మి ముస్తాబైందోచ్ 


గరివిడి లక్ష్మి ఈ పేరు అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉండరు. టీవీలు అరుదుగా ఉన్న రోజుల్లో చాలా గ్రామాల్లో వినోదం అంటే బుర్రకథ. అటువంటి బుర్రకథలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి, యావత్ ఉత్తరాంధ్ర ప్రజలను తన వైపు తిప్పుకొని అద్భుతమైన పేరును సంపాదించింది గరివిడి లక్ష్మి. ఇప్పుడు గరివిడి లక్ష్మి అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రను పోషిస్తుంది. రాగ్ మయూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ జులై 18న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్మెంట్ చేసింది చిత్ర యూనిట్. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆనంది అద్దంలో తనను చూసుకుంటూ రెడీ అవుతుంది. దీనినే చిత్ర యూనిట్ ఉత్తరాంధ్ర యాసలో గరివిడి లక్ష్మి ముస్తాబైందోచ్ అని చెబుతూ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

మరో కొత్త దర్శకుడు 

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ద్వారా గౌరీ నాయుడు జమ్మూ అనే కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు కేరాఫ్ కంచరపాలెం, స్కైలాబ్ వంటి సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఆదిత్య జవ్వాది డిఓపి గా పని చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ నే చాలా గ్రాండ్ గా జరిపింది. ఇప్పుడు సినిమాను కూడా అదే స్థాయిలో నిర్మిస్తుంది. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాట కూడా మంచి ఆదరణ పొందుతుంది. టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. నిర్మాతగా పరిచయం కావడానికి ఎన్నో సినిమాలు అవకాశం ఉన్నా కూడా, ఈ సినిమాని తాను ఎంచుకోవడం పైన చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.

Related News

Ghaati: ఘాటీ సినిమాపై ఈగల్ టీమ్ అభ్యంతరం

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Big Stories

×