SSMB 29 Movie : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే తెలుగు రేంజ్ ఎప్పుడో దాటిపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న రెంజ్ హాలీవుడ్ వరకు వెళ్లింది. ఇంటర్నెషనల్ స్టేజ్ వరకు వెళ్లడమే కాదు… ఎప్పుడూ సాధ్యం కాని ఆస్కార్ అవార్డును కూడా తెలుగు చిత్ర సీమ ఒడిలో చేర్చాడు. దీని తర్వాత జక్కన్నతో సినిమా చేయడానికి హాలీవుడ్ వాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ, జక్కన్న మాత్రం ఇక్కడ నిర్మాతలతోనే సినిమా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు జక్కన్న హాలీవుడ్ వాళ్లతో చేతులు కలపబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 మూవీతోనే స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే జక్కన్న అలా చేయడానికి ఓ ప్రయోజనం ఉందట. ఆ ప్రయోజనం కోసమే హాలీవుడ్ వాళ్లతో చేతులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రయోజనం ఏంటి ? దాని వల్ల ఏం జరిగే ఛాన్స్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనిలో ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ చియన్ విక్రమ్ కూడా ఓ కీ రోల్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రత్యేకమైన సెట్స్ వేసి మరీ షూట్ చేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర భారీ ఖర్చుతో కాశీలోని మణికర్ణిక ఘాట్ సెట్ వేసి షూట్ చేశారు. అలాగే, ఓరిస్సాలోని కొన్ని ఘాట్స్ వద్ద కూడా ఈ మూవీ షూటింగ్ చేశారు. దీంతో పాటు ఆఫ్రికా లోని కెన్యా దేశంలో కూడా ఈ మూవీ షూటింగ్ సాగింది. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు. త్వరలోనే మళ్లీ ఆఫ్రికాలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
ఇదింతా పక్కన పెడితే… ఈ సినిమా నిర్మాతలుగా హాలీవుడ్ నుంచి ఓ ప్రొడక్షన్ హౌజ్ చేరబోతుందట. అందు కోసం జక్కన్న ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అన్నీ కుదిరితే… SSMB 29 మూవీ కోసం హాలీవుడ్ నిర్మాతలు రంగంలోకి దిగడం గ్యారంటీ అని చెప్పొచ్చు. అయితే, హాలీవుడ్ నిర్మాతలను దింపడానికి ఓ ప్రధాన కారణం ఉందట. అదేంటంటే..?
రాజమౌళి గతంలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఒక కేటగిరిలో అవార్డు వచ్చినా… మరిన్నీ ఆస్కార్స్ వస్తాయని అనుకున్నారు. అయితే, అవార్డ్స్ ఎక్కువగా రాకపోవడానికి కారణం… ఆర్ఆర్ఆర్ మూవీ ఫారెన్ మూవీ కేటగిరిలో నామినేట్ అయింది.
ఇప్పుడు SSMB 29 మూవీకి అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు… హాలీవుడ్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు SSMB 29 మూవీ ఫారెన్ కేటగిరి లోకి రాకుండా, లోకల్ మూవీ కేటగిరిలోకి వస్తుంది. దీంతో చాలా ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే, అవార్డులు కూడా ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అందువల్ల SSMB 29 కోసం హాలీవుడ్ నిర్మాతలతో జక్కన్న చేతులు కలపాలని చూస్తున్నాడని టాక్.