Viral Ferrari video: మనిషికి డబ్బు ఉంటే చేసే చర్యలు కాస్త తేడాగానే ఉంటాయి. ఆడంబరాలకు వెళ్లి ఏ పనైనా చేయగలిగే స్థాయికి చేరుకోవడం కామన్. ఆ డబ్బు ఉందనే ఏమో కానీ ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇతను చేసిన అసలు పని మీరు తెలుసుకున్నారా? ఔరా అంటూ నోరెళ్లబెట్టేస్తారు. ఇంతకు ఇతను ఏమి చేశాడో తెలుసా.. 4 కోట్లకు విలువకు పైగా ఉన్న కారును.. ఏకంగా ఇంట్లో వేలాడదీశాడు. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం.
వైరల్.. వైరల్!
ఇతనికి వచ్చిన ఈ వింత ఆలోచన ఎప్పుడూ వచ్చిందో కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపిస్తోంది. సాధారణంగా ఇంటి అందాన్ని పెంచేలా చాండిలియర్ అంటే ఏదైనా ఆకర్షణీయమైన దీపాన్ని ఏర్పాటు చేస్తాం. ఇతను మాత్రం ఆ ప్లేస్ లో ఫెరారీ కారునే ఉంచాడంటే.. ఇక ఇతని బ్యాక్ గ్రౌండ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇతనెవరు?
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి ఓ విదేశీయుడు. ఇతని వివరాలు పూర్తిగా తెలియకపోయినా, ఇతను ఒక క్లాసిక్ కార్ల కలెక్షనర్ అని ప్రచారం సాగుతోంది. తన ఇంటి బయట కాకుండా, ఇంటిలో కూడా కారు ఉండాలన్న కోరికతో ఇలా 4 కోట్లకు పైగా విలువ గల కారును వేలాడదీశాడట.
Also Read: IIT Madras startup: దివ్యాంగులకు సూపర్ గిఫ్ట్.. కేవలం 9 కిలోలే.. ఆ వీల్‌చైర్ వచ్చేసింది!
అంత కాస్ట్లీ కారు.. ఇంట్లోకి ఎలా?
ఫెరారీ కారు అంటేనే ఓ లగ్జరీ. అలాంటి కారును ఇంటిలోకి ఎలా తీసుకువెళ్లాడన్న అనుమానాన్ని నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వీడియోను గమనిస్తే.. 10 మంది కూలీలు ఏకంగా కారును ఎత్తేశారు. అంతేకాదు రెండు చెక్కలపై ఉంచి ఇంట్లోకి తీసుకువచ్చారంటే.. మనోడు ఎంత మొండిఘటమో చెప్పేయవచ్చు. ఇంటి వాకిలి వద్ద కారును సైతం వంచి, ఒక్క దెబ్బ తాకకుండా ఏకంగా తన బెడ్ రూమ్ లో 10 అడుగుల ఎత్తులో కారును వేలాడదీశాడు ఈ ఘనుడు.
రేసింగ్ కారునే ఎందుకిలా?
ఈ కారు విలువ ఇండియా కరెన్సీలో అక్షరాలా రూ. 4.2 కోట్లు. అలాంటి కారునే ఎందుకు సెలెక్ట్ చేశాడన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారు ఇంటిలోకి వచ్చేందుకు అనుకూలం, అలాగే ఇంటి అందాన్ని పెంచడంలో ఈ కారు కరెక్ట్ సూటబుల్ అయిందని అనేస్తున్నారు నెటిజన్స్. దాని లైటింగ్ సిస్టమ్ తో ఇంటికి మరింత అందం వస్తుందని, ఇప్పుడు ఆ కారు రాకతో ఇంటి రేటు పెరిగిందని మరికొందరు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
This guy hung a $500,000 Ferrari in his sitting room as chandelier🤯 pic.twitter.com/l3Xt4RIeLS
— 𝐀𝐬𝐚𝐤𝐲𝐆𝐑𝐍 (@AsakyGRN) July 16, 2025
ఇప్పుడు ఇదే ట్రెండ్..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే, అందరూ ఇదే తరహా ఆలోచనలో పడ్డారట. పాత కార్లను విక్రయించకుండా ఇలా చేస్తే, కారు సెంటిమెంట్ బాగుంటుందని ఇదొక సరికొత్త ఆలోచన అంటూ.. ఇదే మార్గం ఎంచుకున్నారని సోషల్ మీడియా టాక్. మొత్తం మీద ఇంట్లో కారును వేలాడదీసే.. ట్రెండ్ వచ్చిందంటే, ఇక మున్ముందు బైక్స్, చిన్నపాటి వ్యాన్స్ కూడా వేలాడదీసే రోజులు వస్తున్నాయన్నమాట. ఏదిఏమైనా రేసింగ్ కారు.. రేసింగ్ ట్రాక్ నుండి లివింగ్ రూమ్ కు చేరిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మీకు కారు ఉందా? ట్రై చేస్తారేమో చూడండి ఈ కొత్త ట్రెండ్!