Gayatri Gupta: గాయత్రి గుప్తా (Gayatri Gupta).. సినిమాల కంటే కూడా క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై నోరు విప్పుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కన్న తండ్రి తన పాలిట యముడుగా మారాడు అని చెప్పి ఎమోషనల్ అయిన ఈమె.. ఇండస్ట్రీలో తనను చాలామంది అలాంటి కోణంలోనే చూసేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు అలాంటి టచ్ కావాలి అని, లేకపోతే నిద్ర పట్టదు అంటూ హాట్ బాంబ్ పేల్చింది. మరి గాయత్రీ గుప్తా కోరుకుంటున్న ఆ శారీరక స్పర్శ ఎలాంటిదో? ఆమె ఎందుకు అలా చెబుతుందో? ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఐస్ క్రీమ్ 2 సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ..
‘ఐస్ క్రీమ్ 2 ‘ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. చివరిగా ‘సీత ఆన్ ది రోడ్’ సినిమాలో కనిపించిన ఈమె.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్త కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రతిరోజు 12 హగ్గులు కావాలి..
గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. “ప్రతిరోజు నాకు 12 హగ్గులు కావాలి. అది కూడా అమ్మ, నాన్న, అక్క లేదా ఇంకెవరైనా నుంచి.. చెడు ఉద్దేశం లేని వారి నుంచి స్పర్శ కావాలి స్వచ్ఛమైన తాకిడి నా శరీరానికి కావాలి. కనీసం 20 సెకండ్ల పాటు అయినా ఆ హగ్గు ఉండాలి. అక్కడే సేఫ్ అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది.. అప్పుడే మన బాడీ కూడా సేఫ్ గా ఫీల్ అవుతుంది. గతంలో నాకు ఫిజికల్ టచ్ చాలా దొరికేవి. అందుకే అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఫిజికల్ టచ్ కాదు కదా కనీసం కలిసి మాట్లాడడానికి కూడా సమయం దొరకడం లేదు.ఈ కాలం ఎలా ఉందంటే జంతువులు ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడతాయి.. మిగతా సమయంలో రెస్ట్ తీసుకుంటాయి కానీ మనిషి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. పక్కవారితో కూడా మాట్లాడే అంత టైం ఉండదు” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది గాయత్రీ గుప్తా. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
క్యాస్టింగ్ కౌచ్ పై గాయత్రీ గుప్తా ఊహించని కామెంట్స్..
గాయత్రీ గుప్తా పలు ఊహించని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది దర్శక నిర్మాతలు డ్రాప్ చేస్తామని చెప్పి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలపై గాయత్రి స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు.
ALSO READ:Bigg Boss AgniPariksha: 15 కాస్త 13 అయింది.. ట్విస్ట్ తో నరాలు తెగిపోయేలా ఉన్నాయే!