BCCI : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది. ఇటీవల భారత ప్రభుత్వం ప్రమోషన్ బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ తమ జట్లకు స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో టీమిండియా క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారికంగా స్పాన్సర్ లేకుండా పోయింది. మరోవైపు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ లో స్పాన్సర్ జెర్సీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతుందని కొందరు పేర్కొంటే.. మరికొందరు టీమిండియా కొత్త స్పాన్సర్ తోనే బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏమిటంటే..? ఆల్కహాల్ ఉత్పత్తుల బెట్టింగ్ గేంబింగ్ సేవలు క్రిప్టో కరెన్సీ, పొగాకు, ఆన్‌లైన్ మనీ గేమింగ్ వంటి భారత టైటిల్ సాప్‌న్సర్‌గా మారకుండా క్రింది బ్రాండ్‌లపై నిషేధాన్ని BCCI ప్రకటించింది.
Also Read : Rashid Khan : ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం… 1100 మంది మృతి… తీవ్ర విషాదంలో రషీద్ ఖాన్.. భారీ సాయం ప్రకటన
బీసీసీఐ సంచలన నిర్ణయం
ప్రస్తుతం బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టీమిండియా స్పాన్సర్షిప్ పై రోజుకొక కొత్త పేరు తెరమీదకి రావడం గమనార్హం. ఇటీవలే టయోటా మోటార్ కార్పొరేషన్, విమల్ పాన్ మసాలా, అలాగే ఎలన్ మస్క్, టాటా గ్రూప్స్, రిలయన్స్ గ్రూప్స్, అదాని వంటి సంస్థలు ఇండియా స్పాన్సర్షిప్ కోసం ఆసక్తి చూపించినట్టు సమాచారం. అయితే 2025 నుంచి 2028 వరకు మొత్తం మూడు సంవత్సరాలకు రూ. 452 కోట్లకు డీలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా టెస్లా కంపెనీ పేరు వినిపిస్తోంది. టీమిండియా స్పాన్సర్షిప్ కోసం ఎలన్ మస్క్ చాలా ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా డ్రీమ్ 11తో BCCI ఎప్పుడైతే ఒప్పందం రద్దు చేసుకుందో అప్పటి నుంచి పలు కంపెనీల పేర్లు ప్రచారం జరిగాయి.
టీమిండియా స్పాన్సర్ షిప్ ఎవరితో..?
వాస్తవానికి టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ ని అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం వారం రోజుల్లోనే ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలి సిందే.. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. 2023 లో రూ.358 కోట్లతో మూడేళ్లకు డ్రీమ్ 11 తో ఒప్పందం కుదుర్చుకుంది బీసీసీఐ. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ డీల్ మధ్యలోనే రద్దు అయింది. ఈ తరుణంలోనే టీమిండియా కి స్పాన్సర్ షిప్ గా టెస్లా, టాటా గ్రూప్, రిలయన్స్, ఆదాని విమల్ పాన్ మసాలా వంటి కంపెనీలు ఇప్పుడు రేసులోకి రావడం చర్చనీయాంశం అయింది. మరో వైపు రూ.452 కోట్లకు స్పాన్సర్షిప్ తీసుకోవాలని బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. అయితే టీమిండియా కి ఇప్పుడు ఎవరు స్పాన్సర్షిప్ డీల్ కుదుర్చుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.