Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి సామాన్యులకు పెట్టిన అగ్నిపరీక్ష ఇది. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి చాలామంది సామాన్యులు ఆసక్తి చూపించారు. అందులో భాగంగానే ఈసారి ఐదు మందిని హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు మంది కోసం వెతుకులాటలో ఏకంగా 20 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీరందరిని స్పెషల్ రౌండ్స్ ద్వారా ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. ఈ 45 మందిలో ఐదు మందిని సెలెక్ట్ చేయడానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు.
13వ ఎపిసోడ్ మూడవ ప్రోమో రిలీజ్..
జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మినీ షో కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండగా.. నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా 13వ ఎపిసోడ్ కి సంబంధించిన మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఈసారి ఇద్దర్నీ ఎలిమినేట్ చేసినట్లు చూపించడంతో ఈ ప్రోమో ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇందులో రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకు పంపించారు. ఇంకొకరికి ఏకంగా రెండుసార్లు ఎల్లో కార్డు లభించడంతో వారికి కూడా రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించారు. నరాలు కట్ అయ్యేలా ఉత్కంఠతో సాగిన ఈ ప్రోమో అటు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.
తాజా ఎపిసోడ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో విషయానికి వస్తే.. శ్వేతా అనే ఒక కంటెస్టెంట్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఇతరులు సహాయం చేసినా ఆమె తన ఆటలో కొత్తదనం చూపించలేకపోయింది. ఇక దీంతో జడ్జ్ బిందు మాధవి మాట్లాడుతూ.. శ్వేతా మీకు చాలా అడ్వాంటేజ్ ఉండింది. కానీ మీరు దానిని ఉపయోగించుకోలేకపోయారు. ఇందులో ఇప్పుడు అందరికంటే లీస్ట్ లో నువ్వే వచ్చావు. ఇక మీరు ఎలిమినేట్ అంటూ రెడ్ కార్డ్ చూపించింది బిందు మాధవి. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇంకొక ట్విస్ట్ ఉంది ఈరోజు అని చెబుతూ.. ఈ ఎల్లో కార్డు ఈరోజు ఇంకొకరికి వెళ్తుంది అంటూ మిగిలిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఉత్కంఠ పెంచేసింది బిందు మాధవి. ఇక ఆమెతోపాటు చూసే ఆడియన్స్ కూడా నరాలు కట్ అయ్యేలా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక జడ్జ్ నవదీప్ స్టేజ్ పైకి వచ్చి నేను ఇవ్వబోతున్న ఈ ఎల్లో కార్డు తో ఇంకొకరు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పి ప్రోమో ని ఎండ్ చేశారు. మరో రెండు రోజుల్లో అగ్ని పరీక్ష నుండి వెళ్లబోతున్న వీరిలో 15 కాస్త 13 అయ్యింది. మరి వీరి నుండి మరో రెండు రోజుల్లో ఐదు మందిని ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
ALSO READ:Kishkindhapuri Trailer: దెయ్యంలా మారిన అనుపమ… థియేటర్‌లో మరి భయపడుతారా ?