BigTV English

Allu Sirish: అన్నలా అవ్వడం కష్టం కానీ.. మనం రూట్ మారుద్దాం

Allu Sirish: అన్నలా అవ్వడం కష్టం కానీ.. మనం రూట్ మారుద్దాం

Allu Sirish: ఒక చేతికి ఉన్న వేళ్లు ఒకేలా ఉండవు. అలాగే ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములు ఒకేలా ఉండరు. ఎవరి వ్యక్తిత్వం వారిది.. ఎవరి సక్సెస్ వారిది. అన్న సక్సెస్ అయ్యాడు కదా అని తమ్ముడిపై ప్రెషర్ పెట్టకూడదు. ప్రస్తుతం  ఇలాంటి ప్రెషర్ లోనే ఉడికిపోతున్నాడు అల్లు వారి చిన్న కొడుకు అల్లు శిరీష్.  అన్న అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, మనోడు మాత్రం ఇంకా స్ట్రగుల్ హీరోగానే కొనసాగుతున్నాడు. ఇక నెటిజన్స్, ఫ్యాన్స్.. శిరీష్ ఏది చేసినా.. దాన్ని బన్నీకి అన్వయిస్తున్నారు.


మొన్నటికి మొన్న పాపం శిరీష్ ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకుంటే.. అన్న దగ్గర నుంచి కొట్టేశావా అని కామెంట్ పెట్టారు. దానికి శిరీష్ ఎంత ఫీల్ అయ్యాడో.. వైట్ కలర్ షర్ట్ ను కూడా బన్నీ నుంచి కొట్టేయాల్సిన అవసరం ఏముంది బ్రో అంటూ రిప్లై ఇచ్చాడు. అలా ప్రతి విషయంలో కూడా అన్నతో పోలుస్తూ శిరీష్ ను ఇబ్బందిపెడుతున్నారు. అందుకే ఈసారి శిరీష్ గట్టి హిట్ కొట్టడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

గౌరవం సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన శిరీష్.. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు. కొన్ని ఒక మోస్తరుగా ఆడినా కూడా అవేమి అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్న శిరీష్.. గతేడాది బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.  ఇక ఇలా అయితే వర్క్ అవుట్ అవ్వడం లేదని అల్లు వారబ్బాయి రూట్ మార్చాడు.


యాక్షన్ ఫిల్మ్స్ అన్నకు సెట్ అయ్యినట్లు మనకు వర్క్ అవుట్ అవ్వడం లేదు అనుకున్న శిరీష్.. దాన్ని వదిలేసి ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో రావడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమా తీసిన సుబ్బుతో శిరీష్  ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  సుబ్బు కూడా కామెడీని పక్కన పెట్టి బచ్చలమిల్లి అంటూ నరేష్ తో ఒక ప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టింది. దీంతో కామెడీనే బెటర్ అనుకోని సామజవరగమనా లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ స్క్రిప్ట్ ను రాసుకున్నాడట. ఈ సినిమాను ఏ హీరో చేసినా మినిమమ్  గ్యారెంటీ అని పక్కా నమ్మకంతో ఉన్నాడట.

ఇక ఆ స్క్రిప్ట్ పట్టుకొని కుర్ర హీరోల వెంట పడ్డాడట సుబ్బు. అది చివరకు శిరీష్ వద్దకు వచ్చి చేరడం.. కథ నచ్చి వెంటనే  అతను ఓకే చేయడం కూడా జరిగిపోయాయని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. మరి ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లోనే నిర్మిస్తారా.. ? లేక బయటివారు తీసుకుంటారా.. ? అనేది చూడాలి. ఏదిఏమైనా రూట్ మార్చి శిరీష్ మంచి పనే చేశాడని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా అయినా శిరీష్ ను హీరోగా నిలబెడుతుందా అనేది చూడాలి.

Related News

MSG Movie: MSG సెట్లోకి వెంకీమామ ఎంట్రీ.. అప్పుడే టాకీ పార్ట్‌ కూడా పూర్తి .!

Yellamma Movie : చివరికి ఎల్లమ్మకే ఎసరు పెట్టారా… కథలో భారీ మార్పులు ?

Kishkindapuri : బెల్లంకొండ అసలు తగ్గట్లేదు, మిరాయి తో పోటీకి సిద్ధం

Lavyana -Raj Tarun: రాజ్ తరుణ్‌పై మళ్లీ కేసు పెట్టిన లావణ్య.. ఈసారి దేనిపై అంటే?

Ileana D’Cruz: సినిమాలకు మళ్లీ దూరం కానున్న ఇలియానా.. అసలు రీజన్ ఇదే అంటూ!

Mohan Sri Vasta: నన్ను క్షమించండి.. అందుకే చెప్పుతో కొట్టుకున్నా -డైరెక్టర్ మోహన్!

Big Stories

×