BigTV English

Genelia: జెనీలియాలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అస్సలు ఊహించలేదుగా..

Genelia: జెనీలియాలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అస్సలు ఊహించలేదుగా..

Genelia: టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. తెలుగు పరిశ్రమకు సత్యం మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, బొమ్మరిల్లు వంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది. నటిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అప్పటి యువతలో ఓ కలల రాణిగా వెలిగిపోయింది. ఈ సినిమాలన్నింటి కంటే ముందే ‘బోయ్స్’ చిత్రంలో నటించింది.. తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసి బిజీగా మారింది. ఆ తర్వాత కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే ఈమె గురించి ఇన్నాళ్లకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. హీరోయిన్ గా మాత్రమే కాదు ఈమెలో మరో స్పెషల్ టాలెంట్ ఉందంటూ పో వార్త వైరల్ అవుతుంది..


జెనీలియా ఫుడ్ బాల్ ప్లేయరా..?

టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా హీరోయిన్ గా కన్నా ముందు మోడల్గా అందరికీ పరిచయం. అయితే ఫుట్ బాల్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో అటుగా కూడా రానిచ్చిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేసింది. చిన్నప్పటి నుంచి పుట్ బాల్ ఆడే అలవాటు ఉంది. ఆ అలవాటు కేవలం టైంపాస్ గా మాత్రమే కాకుండా సీరియస్ ప్రయత్నాలు చేసి జాతీ య స్థాయిలో పుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగిందిట. ఇకపోతే ఇంటర్మీడియట్ లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ లోకి వచ్చిందిట. ఆ తర్వాత నటిగా కెరీర్ అనుకోకుండానే మొదలైందని తెలిపింది. అలా సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో. జెనీలియా లో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.


Also Read : చిరు – బాబీ కాంబోలో మూవీ ఫిక్స్.. ఫ్యాన్స్ కు ‘పూనకాలు లోడింగ్’ అయ్యే టైటిల్..

జెనీలియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 

మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను అనతికాలంలోనే సంపాదించుకుంది.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది. 2000 దశకంలో ఈమె దక్షిణాది పరిశ్రమలో అగ్రకథానాయికల్లో ఒకరిగా ఉన్నది. ఈమెకు రెండు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇతర పురస్కారాలు దక్కాయి. 13 ఏళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ జూనియర్ సినిమాతో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో జెనీలియా కీలక పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది. ఈమె తెరపై కనిపించినంత సేపు సీరియస్ పాత్రలో ఎంగేజ్ చేసింది. కంబ్యాక్ పరంగా జెనీలియాకు మంచి రోల్ పడిందని చెప్పొచ్చు.. మరి సినిమాల్లో ఇలానే కొనసాగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా జెనీలియా ను ఇన్ని రోజుల తర్వాత స్క్రీన్ పై చూడటంతో ఆమె అభిమానుల సంతోషానికి అవధులు లేవు..

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×