Anasuya..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఫాలోవర్స్ ను పెంచుకునే దిశగా ఇంస్టాగ్రామ్ లో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవారైతే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంటే.. మరి కొంతమంది కాంట్రవర్సీ మాటలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అయితే ఇక్కడ అనసూయ(Anasuya ) మాత్రం ఏకంగా 30 లక్షల మంది ఫాలోవర్స్ ను బ్లాక్ చేశానని చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలే ఫాలోవర్స్ కోసం సెలబ్రిటీలు నానాతంటాలు పడుతుంటే.. ఈమె మాత్రం బ్లాక్ చేశానని చెప్పి ఆశ్చర్య పరిచింది. మరి అనసూయ 30 లక్షల మంది ఫాలోవర్స్ ను బ్లాక్ చేయడం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
అందుకే 30 లక్షల మంది ఫాలోవర్స్ ను బ్లాక్ చేశా – అనసూయ
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ మాట్లాడుతూ..” ఇప్పటివరకు నేను సోషల్ మీడియాలో దాదాపు 30 లక్షల మందిని బ్లాక్ చేశాను. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఇక బ్లాక్ చేయడమే. నిజానికి కొన్నిసార్లు నెటిజన్స్ కామెంట్లకు భరించలేకపోయాను. కొన్నింటికి రియాక్ట్ కూడా అయ్యాను. మరి కొన్నింటికి కాలేకపోయాను. ఇక అందుకే చివరికి నా ప్రపంచంలో నువ్వు లేవు అనుకుంటూ బ్లాక్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే నెగిటివ్ కామెంట్స్ వల్లే తాను విసిగిపోయి, ఇలా ఏకంగా 30 లక్షల మందిని బ్లాక్ చేసానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది అనసూయ.
జబర్దస్త్ ద్వారా భారీ గుర్తింపు..
న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది అనసూయ. దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకరింగ్ చేసిన ఈమె అక్కడ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా గ్లామర్ తోనే కాదు వాక్చాతుర్యంతో కూడా కట్టిపడేసింది అనసూయ.
అనసూయ సినిమాలు..
జబర్దస్త్ లో చేస్తున్నప్పుడే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించి స్టార్ నటిగా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు మళ్లీ అదే డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో కూడా దాక్షాయిని పాత్ర పోషించి అబ్బురపరిచింది. ఒకవైపు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరొకవైపు పలు చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తున్న ఈమె.. అటు వైవాహిక జీవితంలో కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ.. చక్కగా హ్యాండిల్ చేస్తోంది. అటు కాంట్రవర్సీ విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అనసూయ వ్యక్తిగత జీవితం..
చదువుకునే సమయంలోనే సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డ ఈమె అతడిని వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఆ తర్వాత కొన్నేళ్లు వెయిట్ చేసి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన అనసూయ, ఇటీవల తన కొడుకులకు తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఉపనయనం చేయించిన విషయం తెలిసిందే.
ALSO READ: Deepika Padukone: దీపిక పదుకొనే కి అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే!