Megastar – Bobby : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ప్రస్తుతం ఈయన రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర.. ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ ఉండడంతో ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో పాటుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో మెగా 157 మూవీ తెరకెక్కుతుంది. ఏ మూవీ కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తవ్వకుండానే మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చిరు -బాబీ కాంబోలో మరో మూవీ…
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ను కూడా బాగానే వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేసిన రెండు సినిమాలు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా వీళ్లిద్దరు కాంబోలో రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి పూనకాలు లోడింగ్ అని టైటిల్ ని ఖరారు చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగే.. త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read:బుల్లి రాజు క్రేజ్ వేరే లెవల్.. ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ కోటా..?
చిరంజీవి సినిమాల విషయానికొస్తే..
చిరంజీవి గతంలో భోళా శంకర్ మూవీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ అంచనాలతో వచ్చిన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.. ఆ మూవీ తర్వాత చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నారు.. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం. అలాగే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని టాక్. ఈ రెండు సినిమాలు తర్వాత చిరంజీవి ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా బాబీ సినిమాలో నటించబోతున్నారని సన్నిహిత వర్గాల్లో టాక్. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందో చూడాలి..