Sudigali Sudheer:సుడిగాలి సుధీర్, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘GOAT’ సినిమా నవంబర్12 న రిలీజ్ కి సిద్దమైంది.ఇక ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఇందులో భాగంగా తాజాగా బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. . ఈ ఇంటర్వ్యూలోనూసత్తి తనదైన శైలిలో సుధీర్, దివ్య భారతిలను ఆటపట్టిస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ ఇచ్చాడు.
మొదటగా సుడిగాలి సుధీర్ ని అడుగుతూ చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ అంటే ఇష్టమా, నీకు క్రికెట్ ఆడటం వచ్చా అంటూ వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు సత్తి.ఇక తనకు పెద్దగా క్రికెట్ రాకపోయినా ఫ్రెండ్స్‌తో కలిసి అప్పుడప్పుడు ఆడేవాడినని సుధీర్ చెప్పడంతో, బ్యాట్ పట్టుకున్నంత మాత్రాఇక న పెద్ద బ్యాట్స్‌మెన్ అయిపోరంటూ సత్తి వేసిన పంచులు నవ్వులు పూయించాయి.
ఇక ఈ ఇంటర్వ్యూలో అసలు హైలైట్ మాత్రం ‘GOAT’ అనే పదం చుట్టూ నడిచిన కామెడీ అనే చెప్పాలి. సాధారణంగా ఇంగ్లీష్‌లో ‘Greatest Of All Time’ అనే పదానికి షార్ట్‌కట్‌గా GOAT అంటారన్న సంగతి తెల్సిందే. కానీ బిత్తిరి సత్తి మాత్రం దీన్ని డైరెక్ట్‌గా మేకతో ముడిపెట్టేయడంతో నవ్వుల వర్షం కురిసింది. GOAT అంటే మేకనా? మేక కూర తింటాడా? మేకలను ఎత్తుకెళ్తాడా? అంటూ సుధీర్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు సత్తి.ఇక ఆఫ్‌కి అర్థం ఏంటంటూ ఇంగ్లీష్ పదాలను విడదీసి సత్తి చేసిన కామెడీ నెక్స్ట్ లెవెల్ .
ఇక సుధీర్ తర్వాత హీరోయిన్ దివ్య భారతి వైపు తిరిగాడు సత్తి . తమిళనాడుకు చెందిన దివ్య భారతి తెలుగు మాట్లాడే తీరుని, ఆమె ఇష్టాలను కామెడీ కామెడీ చేసేశాడు.ముఖ్యంగా ఆమెకు పిల్లులంటే ఇష్టమని తెలుసుకున్న సత్తి, పిల్లులను ఎందుకు పెంచుకోవాలి, వాటి వల్ల మనకేం ఉపయోగం అంటూ అమాయకంగా అడగడం ఇక్కడ హైలెట్.
కుక్కలను పెంచుకోవడంతో పోల్చుతూ సత్తి అడిగిన తీరు కూడా నవ్వులు పూయించింది.ఇక తాను సముద్రం దగ్గరే పెరిగినప్పటికీ బీచ్‌కి వెళ్లాలంటే భయమని దివ్య భారతి చెప్పడంతో, సముద్రానికి చెరువుకి ఉన్న తేడా ఏమిటంటూ సత్తి చేసిన కామెంట్లకి పొట్ట పట్టేసుకున్నారంతా.
ఇక తెలుగు సరిగ్గా రాకపోయినా సినిమాల్లో డైలాగులు ఎలా చెబుతున్నారంటూ దివ్య భారతిని సత్తి అడగగా షూటింగ్‌కి ముందే డైలాగులు బాగా ప్రిపేర్ అయ్యి వస్తానని, దర్శకుడు అలాగే తనకు హెల్ప్ చేస్తారని చెప్పుకొచ్చింది.
మొత్తంగా చూస్తే, సుధీర్‌ను క్రికెట్ మరియు GOAT పేరుతో ఆటపట్టించడం నుంచి, దివ్య భారతితో తెలుగు భాష , పిల్లుల వరకు బిత్తిరి సత్తి ఈ ఇంటర్వ్యూను కామెడీ కామెడీగా ఎంటర్ టైన్ చేసేశాడు. చూడాలి మరి ప్రమోషన్స్ లో వేగం పెంచిన GOAT నవంబర్12 న ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో !
ALSO READ :ప్రణవి మానుకొండ అందాల విందు.. ఈ ఫోటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!