Alias Rukmini First Single: టాలీవుడ్ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈయన మాత్రం సరైన సక్సెస్ అందుకోలేదు. హిట్ సినిమాలు లేకపోయినా ఈయన మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక త్వరలోనే నితిన్ అలియాస్ రుక్మిణి(Alias Rukmini) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దండోరా ఫేమ్ మురళి కాంత్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదివరకే చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి మొదటి పాట రుక్కు రుక్కు రుక్మిణి సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా విజయ్ బల్గానిన్ కంపోస్ట్ చేశారు. ఇక ఈ పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో నితిన్ జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆఫియా సయ్యద్(Afia Sayyad) నటించబోతున్న సంగతి తెలిసిందే.
అలియాస్ రుక్మిణి సినిమా ద్వార ఆఫియా సయ్యద్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఈమె రుక్మిణి అనే టీచర్ పాత్రలో కనిపించబోతున్నారని ఇదివరకు ఈమె ఫస్ట్ లుక్ విడుదల చేసిన సమయంలో మేకర్స్ తెలియచేశారు. తెలుగు సినిమాలోని కృష్ణ అని పాత్రలో కనిపించబోతున్నారని వీరిద్దరూ భార్యాభర్తలుగా సందడి చేయబోతున్నట్టు సమాచారం. మరి సరికొత్త విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అలియాస్ రుక్మిణి సినిమా ద్వారా నితిన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.
నితిన్ చివరిగా తమ్ముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా తమ్ముడు సినిమా నిరాశ పరిచినప్పటికీ నితిన్ మాత్రం వరుస అవకాశాలను అందుకుంటున్నారు ప్రస్తుతం ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న నితిన్ కు అలియాస్ రుక్మిణి ఊరట కలిగించేనా లేదంటే మరోసారి ఫ్లాప్ సెంటిమెంట్ కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 4వ తేదీ మరో నటుడు నాగచైతన్య నటించిన వృషకర్మ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే వృషకర్మ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 4వ తేదీ బాక్సాఫీస్ వద్ద ఎవరిది పై చేయి అవుతుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: ‘హుషారు 2’ టీజర్.. ఇలా ఉందేంటి భయ్యా? ఆ పాత్రలో ఆర్ నారాయణమూర్తి!