E-Paper
Advertisement

హోమ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ మెప్పించనుందా.. పవర్ పేటలో రితికా!

హోమ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ మెప్పించనుందా.. పవర్ పేటలో రితికా!
Advertisement

Power Peta:సందీప్ కిషన్..అన్నీ ఉన్నా అదొక్కటే తక్కువ అన్నట్టుగా కావలసినవి అన్నీ ఉన్నా ప్లాపుల పరంపరకి బ్రేకులు మాత్రం వేయలేకపోతున్నాడు. అయినప్పటికీ మరోసారి అంటూ సరికొత్త స్టోరీతో వస్తున్న ‘పవర్ పేట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు.70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.పైగా ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించడం విశేషం.ఇక ఈ మూవీలో రాజకీయాలు, ప్రేమ, అధికారం కోసం జరిగే పోరాటం వంటి పవర్‌ఫుల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.

రితికా నాయక్ బర్త్‌డే సందర్భంగా

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ రితికా నాయక్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.అక్టోబర్ 27న రితికా నాయక్ పుట్టినరోజు కావడంతో చిత్రబృందం ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో ఆమెను ‘పడమటి వీధి జానకి’గా ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. జనరల్‌గా సినిమాల్లో హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించడం కామన్, కానీ ఈ సినిమాలో రితికా లుక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా, పాతకాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేసేలా ఉంది. క్రీమ్ కలర్ హాఫ్ శారీ, పింక్ దుపట్టా, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకొని హోమ్లీగా కనిపిస్తోంది. కిటికీ దగ్గర కూర్చుని ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో జానకి పాత్రకు మంచి వెయిట్ ఉన్నట్లు తెలిసిపోతుంది.

గ్లామరస్ సీన్లలో కూడా

Advertisement

అయితే పోస్టర్‌లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు సినిమాలో కొన్ని గ్లామరస్ సీన్లలో కూడా అదరగొట్టబొతుందని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా వర్షంలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా టాక్ నడుస్తోంది. మరి ఈ జానకి పాత్ర కేవలం లవ్ స్టోరీకే పరిమితమవుతుందా, లేక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథలో ఏమైనా మేజర్ ట్విస్ట్ ఇస్తుందా అనేది సినిమా చూస్తేనే తెలియాలి. ఇక ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కి ‘మిరాయ్’ వంటి సినిమాలతో దగ్గరైన ఈ బ్యూటీ ఈ సినిమాతో మరింత క్రేజ్ కొట్టేయాలని ఆశపడుతున్నారు రితికా ఫాన్స్.

పవర్ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో !

ఇక ఈ చిత్రంలో సందీప్ కిషన్ విషయానికి వస్తే’సేనాపతి రవి’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.ఇక ఇప్పటికే సుమారు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, మిగతా పార్ట్‌ను కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. చూడాలి మరి రౌడీ ఫెలో,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి డిఫరెంట్ మూవీస్ తీసిన కృష్ణ చైతన్య ఈసారి పొలిటికల్ అండ్ పవర్ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో !

ALSO READ :గాజులు గలగల పాటతో ఫేమస్..రాధమ్మ కూతురు వర్సెస్ కళ్యాణమ్మ

Tags

Related News

ఈసారి బాక్సాఫీస్ దగ్గర సిక్సర్లు కొడతామంటున్న వెంకీ మామ!

సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

ప్రణవి మానుకొండ అందాల విందు.. ఈ ఫోటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

కోటి రూపాయల ఛాలెంజ్.. ‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పడం అంత ఈజీ కాదట!

‘జైలర్ 2’ కంటే ముందే రజినీ, హృతిక్ కలిసి నటించిన మూవీ ఏమిటో తెలుసా?

నితిన్ అలియాస్ రుక్మిణి నుంచి రుక్కు రుక్కు రుక్మిణి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Big Stories

Advertisement
×