Sudigali Sudheer:సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన ‘G.O.A.T’ సినిమా నవంబర్ 12న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచింది మూవీ టీమ్.ఇందులో భాగంగా ప్రముఖ యాంకర్, కమెడియన్ బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్అవుతుంది. ఎప్పటిలాగే తనదైన తెలంగాణ యాస, కామెడీ ప్రశ్నలతో సుధీర్, దివ్యభారతిలను బిత్తిరి సత్తి ఆటపట్టించిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్
ఇందులో ముఖ్యంగా సుదీర్ పెళ్లిపై గట్టిగా ఫోకస్ చేశాడు బిత్తిరి సత్తి. సినిమాలు, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న సుధీర్‌ను ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ సత్తి ప్రశ్నిస్తూనే, మధ్యమధ్యలో భార్య నుంచి వచ్చే ఫోన్లు, లేట్ గా ఇంటికి వెళ్తే ఎదురయ్యే ఫన్నీ ఇన్సి డెంట్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెబుతూ సుధీర్‌ను ఆటపట్టించాడు. దానికి సుధీర్ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం సోలో లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని, ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన ఏమీ లేదని నవ్వుతూ మనసులోని మాటని బయటపెట్టాడు.అలాగే టీవీ షోలలో ఒక ప్రముఖ యాంకర్‌తో తనను ముడిపెట్టడంపై కూడా సుధీర్ రియాక్ట్ అవుతూ షోలో జరిగే విషయాలను ,పర్సనల్ లైఫ్ ని వేర్వేరుగా చూడాలని క్లారిటీ ఇచ్చాడు.
దివ్యభారతిని కూడా
మరోవైపు హీరోయిన్ దివ్యభారతిని కూడా బిత్తిరి సత్తి గట్టిగానే ఆట పట్టించాడు. ఆమె వయసు, కాలేజీ రోజులు, సినిమాలో ఆమె చేసిన రోల్స్ గురించి అడుగుతూ కామెడీ చేసేశాడు. ఆడవాళ్ళు వయసు బయటపడకుండా ఎలా జాగ్రత్తపడతారో చెబుతూ సత్తి వేసిన పంచులు ఇంటర్వ్యూలో నవ్వులు నవ్వులు పూయించాయి. ఇక షూటింగ్ సమయంలో సుధీర్, దివ్యభారతి మధ్య ఉన్న పరిచయం, ఇద్దరూ కలిసి లంచ్ చేసిన సందర్భాల గురించి అడిగి వారి మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుసుకున్నాడు సత్తి
విశేషాల గురించి మాట్లాడే క్రమంలో
ఇక సినిమా విశేషాల గురించి మాట్లాడే క్రమంలో సుధీర్ చెబుతూ ఈ సినిమాలో తన డబ్బింగ్ కోసం కొత్త టెక్నిక్ ఉపయోగించినప్పటికీ అది అనుకున్నంతగా వర్కవుట్ కాకపోవడంతో, చివరికి తన సొంత గొంతుతోనే డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలిపాడు. అలాగే తనకు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని, వారి సినిమాలు చూస్తూ పెరగడం వల్ల డ్యాన్స్ చేసే సమయంలో తనకు తెలియకుండానే వారి బాడీ లాంగ్వేజ్ స్టైల్ వచ్చేస్తుందని సుధీర్ చెప్పాడు.
నవంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న ‘G.O.A.T’
ఇక వేదవ్యాస్ ఆకుల దర్శకత్వం వహించిన ఈ ‘G.O.A.T’ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయని, తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని సుధీర్ చెప్పాడు. నవంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరాడు. మొత్తానికి బిత్తిరి సత్తి సుదీర్ తో ఆడుకున్న తీరు ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.
ALSO READ :గాజులు గలగల పాటతో ఫేమస్..రాధమ్మ కూతురు వర్సెస్ కళ్యాణమ్మ